Ads
కరోనా వైరస్ నివరించడానికి శానిటైజర్స్, సబ్బుతో చేతులు కడుక్కోవడం ఒక్కటే మార్గమని వాటినే ఫాలో అవుతున్నాం..ప్రభుత్వాలు కూడా ఎక్కడిక్కడ శానిటైజర్లతో శుద్ది చేస్తున్నారు. కూరగాయలు ఇతరత్రా వాషబుల్ ఫూడ్ ఐటమ్స్ ని ఉప్పు నీటితో కడిగితే తప్ప ముట్టుకోని పరిస్థితి..కాని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనగా లాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్, కరెన్సీ నోట్స్ ఇతరత్రా వస్తువులపై కరోనాని అంతమొందించడం ఎలా? వాటిని శానిటైజర్ తో క్లీన్ చేయలేం కదా..ఆ సమస్యకు పరిష్కారం గా DRDO ఒక పరికరాన్ని రూపొందించది.
Video Advertisement
DRUVS (డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రా వయోలేట్ శానిటైజర్)
మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చలాన్లు మొదలైన వాటిని శుభ్రపరిచేందుకు హైదరాబాద్ లోని DRDO( డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ల్యాబ్ రూపొందించిన పరికరం “కాంటాక్ట్ లెస్ శానిటైజేషన్ కేబినెట్”. DRUVS ( Defence Research Ultraviolet Sanitizer) గా దీనికి నామకరణం చేశారు..DRUVS (డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రా వయోలేట్ శానిటైజర్) ఆటోమేటెడ్ యువీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరం ”NOTESCLEAN” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ట్వీట్ చేసింది. ఈ కేబినెట్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయొచ్చని డీఆర్డీవో తెలిపింది.
ఎలా పనిచేస్తుంది?
ఈ కేబినెట్ UV కిరణాల సాయంతో సెన్సార్ల ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరంలో ఓ డ్రాయర్ ఉంటుంది, ఆది ఆటోమేటిక్గా కాంటాక్ట్ లెస్ గా ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఉంచే ప్రతీ వస్తువును, పరికరాన్ని 360 డిగ్రీల్లో యూవీ(అతినీలలోహిత) కిరణాలతో శుభ్రం చేసి, క్లీన్ అయిన తర్వాత, సిస్టమ్ స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది.
యూవీ బ్లాస్టర్
డీఆర్‌డీవో మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. దాని పేరు ‘యూవీ బ్లాస్టర్’. ఇది కూడా UV(అతినీలలోహిత) కిరణాల సాయంతో పనిచేస్తుంది. ఇది ఓ టవర్ ఆకారంలో ఉంటుంది. కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఉపకరణాల ఉపరితలాలను అతినీల లోహిత(యూవీ) కిరణాలతో శుద్ధిచేయగల ఈ టవర్‌ను డీఆర్‌డీఓ- లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ రూపొందించింది.
యువీ బ్లాస్టర్ పనిచేయు విధానం
రసాయనాలు, క్రిమిసంహారకాలతో శుద్ధిచేయడానికి వీలుపడని ప్రతీ వస్తువును, పరికరాన్ని ఇది 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేయగలదు. 43 వాట్ల యూవీ-సీ బల్బులు ఆరు ఇందులో ఉంటాయి. ఇవి 254 నానోమీటర్ తరంగ దైర్ఘ్యంతో పనిచేస్తుంది.12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగిన గదిని వైరస్ రహితంగా శానిటైజ్ చేసేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది. 400 చదరపు అడుగుల ఏరియా శుద్ధికి అరగంట సమయాన్ని తీసుకుంటుంది. ఈ పరికరాన్ని wifi ద్వారా ఆపరేట్ చేసే వీలుంది.
ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు?
ఆఫీసులు, లేబోరేటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో UV బ్లాస్టర్ ని ఉపయోగించవచ్చు. అంతేకాకుండా జనసమర్థం ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో ఈ యూవీ బ్లాస్టర్‌ను వినియోగించి పరిసరాలన్నింటినీ శానిటైజ్ చేయవచ్చు. ఈ పరికరం పూర్తిగా రసాయన రహితంగా పని చేస్తుంది. ఈ పరికరాన్ని ఏదైనా గదిలో ఉంచి ఆన్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ గదిలోకి ఎవరైనా ప్రవేశించారంటే వెంటనే పరికరం ఆఫ్ అయిపోతుంది.సో దీనివలన మనుషులపై ప్రభావం ఉంటుందనే భయం కూడా అక్కర్లేదు.
End of Article