400 థియేటర్ లు..! ఇది లాభమా..? నష్టమా..?

400 థియేటర్ లు..! ఇది లాభమా..? నష్టమా..?

by Megha Varna

Ads

ఈసారి సంక్రాంతి కి మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలనే కనపడుతోంది. ఎందుకంటే 2023 సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు వస్తున్నాయి. పైగా ఐదు సినిమాలు కూడా పెద్ద హీరోలవే. అయితే ఈ సినిమాలకి సమానంగా థియేటర్లను కేటాయిస్తే ఒక్కో చిత్రానికి నాలుగు వందల థియేటర్లు వస్తాయట.

Video Advertisement

అలానే కేవలం ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వచ్చేలానే కనపడుతోంది. అయితే 400 థియేటర్లలో కనుక సినిమా రిలీజ్ అయితే కలెక్షన్లు చాలా తగ్గుతాయి.

కలెక్షన్లు కనుక రావాలంటే ఏమైనా సినిమాలు తప్పుకుంటే బెస్ట్. లేదంటే కలెక్షన్లు చాలా తగ్గుతాయి. ఇక ఏయే సినిమాలు విడుదల అవుతాయి అనేది చూస్తే.. ఏజెంట్, వారసుడు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఆదిపురుష్ సినిమాలు ఈ సంక్రాంతికి రానున్నాయి. మరి ఏం అవుతుందో చూడాలి.

minus points in chiranjeevi waltair veerayya title teaser

వాల్తేరు వీరయ్య సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అంతకుముందు చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ నటించారు ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు.

వీరసింహారెడ్డి మాస్ యాక్షన్ సినిమా. బాలయ్య హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా అవుతోంది. ఈ సినిమా అయ్యాక బాలకృష్ణ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రభాస్ ఆది పురుష్ కూడా ఈ సంక్రాంతికి రానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఏజెంట్, వారసుడు సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.

 

 

 


End of Article

You may also like