Ads
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సంతోష్ శోభన్. ఇటీవల అన్నీ మంచి శకునములే సినిమాతో మన ముందుకి వచ్చారు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ప్రేమ్ కుమార్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ప్రేమ్ కుమార్
- నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, కృష్ణ చైతన్య, రుచిత సాదినేని.
- నిర్మాత : శివ ప్రసాద్ పన్నీరు
- దర్శకత్వం : అభిషేక్ మహర్షి
- సంగీతం : ఎస్. అనంత్ శ్రీకర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 18, 2023
స్టోరీ :
ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభన్) పెళ్లి కొన్ని కారణాలవల్ల ఆగిపోతుంది. పెళ్లి పీటల మీద నేత్ర (రాశి సింగ్) అనే ఒక అమ్మాయిని ప్రేమ్ కుమార్ పెళ్లి చేసుకుంటూ ఉండగా రైజింగ్ స్టార్ రోషన్ (కృష్ణ చైతన్య) అనే ఒక హీరో వచ్చి తాను నేత్రని ప్రేమిస్తున్నాను అని చెప్పి తీసుకువెళ్లిపోతాడు. దీనికి అమ్మాయి తండ్రి (రాజ్ మాదిరాజు) కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కూడా ప్రేమ్ కుమార్ కి ఇంకో ఇద్దరితో పెళ్లి వరకు వెళ్ళాక కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంది. దాంతో ప్రేమ కుమార్ తన ఫ్రెండ్ సుందర్ లింగం (సుదర్శన్) తో కలిసి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ మొదలు పెడతాడు.
జంటలని విడగొట్టడమే వీరి పని. అయితే రోషన్ నేత్రని కాదు అని అంగన (రుచిత సాదినేని) అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అసలు రోషన్ ఎందుకు ఇలా చేశాడు? నేత్ర పరిస్థితి ఏంటి? ఈ చిక్కుల నుండి ప్రేమ్ కుమార్ ఎలా బయటికి వచ్చాడు? ఆ తర్వాత వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న కథలని ఎంచుకుంటూ, ఒక సినిమాకి మరొక సినిమాకి తేడా ఉండేలా చూసుకుంటున్న నటులలో సంతోష్ శోభన్ ఒకరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా తనని తాను ప్రతి సినిమాకి నటుడిగా నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా నిరూపించుకునే ప్రయత్నంలో ఒక భాగం. ఇలా హీరోకి పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయే సినిమాలు మనం చాలా చూశాం. అలాంటి ఒక వ్యక్తి కథని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
ఎన్నో సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది. ఈ కాలం యువతీ యువకులు ఎదుర్కొనే సమస్యలు, వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే పేపర్ పై ఉన్న పాయింట్ ని తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడు కొంచెం విఫలం అయ్యారు ఏమో అనిపిస్తుంది. సినిమాలో చాలా విషయాలని ఎమోషనల్ గా చూపించడంతో పాటు, కొంచెం కామెడీ కూడా యాడ్ చేసి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలాగా చెప్పాలి అని ప్రయత్నం చేశారు.
కానీ ఆ కామెడీ మాత్రం కాస్త ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. కానీ సంతోష్ శోభన్ సినిమాకి ఒక హైలైట్ అయ్యారు. చాలా సీన్స్ లో ఒక ఈజ్ తో యాక్షన్ చేశారు. అలాగే అంగన పాత్ర పోషించిన రుచిత కూడా బాగా చేశారు. మిగిలిన వారు అందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.
సినిమా ముందుకి నడుస్తున్న కొద్ది తర్వాత ఏమవుతుంది అనే విషయం అర్థం అయిపోతుంది. ఒకవేళ అలా అర్థం అయినా కూడా కనెక్టివిటీ అనేది మిస్ అయ్యింది. దాంతో సినిమా చాలా ల్యాగ్ గా అనిపిస్తుంది. హీరోకి, హీరో ఫ్రెండ్ కి మధ్య వచ్చే సీన్స్ కామెడీగా ఉంటాయి. కానీ మిగిలిన సినిమా అంతా కూడా చాలా వరకు సాగదీసినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- కాన్సెప్ట్
- నటీనటులు
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- క్లైమాక్స్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- తెలిసిపోయే కథ
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా స్టోరీ పరంగా ఇది ఒక కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. కానీ ఆ ప్రయత్నాన్ని తెరపై చూపించడంలో మాత్రం డైరెక్టర్ విఫలం అయ్యారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అసలు సినిమా ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకునే వారికి ప్రేమ్ కుమార్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : పాట విని ఎమోషనల్ అయిన సమంత..! “ఇంకా మర్చిపోలేదా..?” అంటూ కామెంట్స్..!
End of Article