Home Filmy Adda సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ…పార్ట్ 1 హిట్..మరి పార్ట్ 2?

సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ…పార్ట్ 1 హిట్..మరి పార్ట్ 2?

by Sainath Gopi

సైలెంట్ గా రిలీజ్ అయ్యి, సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా సప్త సాగరాలు దాటి. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా, తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయినా కూడా ఒక తెలుగు సినిమాకి సమానంగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి రెండవ భాగం రిలీజ్ చేశారు. నవంబర్ 17 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూసేద్దాం.

sapta sagaralu dhaati side b movie review

మొదటి పార్ట్ ముగిసిన పది సంవత్సరాల తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. 2021 లో మనిషితో మనిషి మాట్లాడడానికి, అసలు మాస్క్ లేకుండా రోడ్ మీదకి రావడానికి కూడా ఆలోచించే సమయంలో ఈ కథ నడుస్తుంది. జైలు నుండి మను (రక్షిత్ శెట్టి) బయటికి వచ్చేస్తాడు. ప్రియ (రుక్మిణి వసంత్) పెళ్లి చేసుకుంటుంది. ఒక బాబు కూడా ఉంటాడు. ఒక బట్టల కాణంలో పని చేస్తూ ఉంటుంది. మనుకి సురభి (చైత్ర ఆచార్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మను ప్రియని ఎలా కలిశాడు? సురభి మనుని ప్రేమించిందా? 10 సంవత్సరాల తర్వాత మనుని చూసిన ప్రియ ఏం చేసింది? తనని ఇబ్బంది పెట్టిన వారిపై మను పగ ఎలా తీర్చుకున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

sapta sagaralu dhaati side a movie review

ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో ఎన్నో ప్రేమ కథలు వస్తాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా గుర్తుండిపోతాయి. ఇటీవల వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాని అలా గుర్తుండిపోయే సినిమాల కిందకే లెక్క వేస్తారు. లవ్ స్టోరీ అంటే కేవలం ఇద్దరు ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, దానికి సమస్య కూడా ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చూపించారు.

You may also like