Ads
కొంతమంది సినిమాలో చేసిన పాత్రలు ఎంతో కాలం వరకు అలా గుర్తుండిపోతాయి. వాళ్ల అసలు పేరును కూడా మర్చిపోయి సినిమా పేరుతోనే ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పాత్రలు ఆ నటుల జీవితాన్ని కూడా మారుస్తాయి.
Video Advertisement
అలా మనకి గుర్తుండిపోయిన పాత్రల్లో నాన్న సినిమా లో వెన్నెల పాత్ర ఒకటి. ముఖ్యంగా క్లైమాక్స్ లో విక్రమ్ పాత్ర, వెన్నెల మధ్య వచ్చే ఆ ఎమోషనల్ ఈ సీన్ చూసి చాలామంది ఏడ్చే ఉంటారు. వెన్నెల పాత్ర పోషించిన నటి పేరు సారా అర్జున్.
2011లో వచ్చిన ఫోర్ నాట్ ఫోర్ (404) ఈ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించింది సారా. తర్వాత అదే సంవత్సరంలో తమిళ్ లో దైవ తిరుమగళ్ సినిమాలో నటించింది. ఆ సినిమానే తెలుగులో నాన్న పేరుతో అనువాదం అయింది.
తర్వాత ఒక తమిళ్ సినిమా, హిందీలో జై హో (స్టాలిన్ రీమేక్) లో నటించింది. 2014 లో శైవం అనే తమిళ సినిమాలో నటించింది. నాన్న సినిమా తర్వాత మళ్లీ అంత ముఖ్యమైన పాత్ర ఉన్న సినిమా శైవం.
2015 లో సినిమా తెలుగులో దాగుడుమూత దండాకోర్ పేరుతో రీమేక్ అయ్యింది. రీమేక్ లో కూడా తన పాత్రను సారా నే పోషించింది. తర్వాత కొన్ని హిందీ, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది.
2019లో ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో చిన్నప్పటి సోనమ్ కపూర్ పాత్రను పోషించింది. అలాగే సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో వృద్ధురాలి పాత్రలు పోషించిన తాప్సీ, భూమి పెడ్నేకర్ లకు మనవరాలిగా నటించింది.
ఆ తర్వాత తమిళ్ లో వచ్చిన సిల్లు కరుపట్టి చిత్రంలో నటించింది. ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. అందులో ఒక ప్రేమకథ, టీనేజ్ లవ్ స్టోరీ. ఆ కథలో హీరోయిన్ గా నటించింది సారా.
సారా తండ్రి కూడా నటులే. మనం ఆయనని ఇటీవల ఒక తెలుగు సినిమాలో కూడా చూసాం. ఆయన పేరు రాజ్ అర్జున్. డియర్ కామ్రేడ్ సినిమా లో సెకండ్ హాఫ్ లో వచ్చే విలన్ పాత్ర పోషించింది ఆయనే.
రాజ్ అర్జున్ కూడా ఎన్నో హిందీ తమిళ చిత్రాల్లో నటించారు. సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో రాజ్ అర్జున్ చేసిన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో ఆయన మొదటి చిత్రం డియర్ కామ్రేడ్.
End of Article