మన ఇండస్ట్రీలో ప్రతి శాఖలో ఎంతో మంది కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. అలా టాలెంట్స్ ని మనకి ప్రజెంట్ చేసే ఒక ప్లాట్ ఫామ్ రియాలిటీ షోస్. ఎన్నో కొత్త  టాలెంట్స్ ని మనకి పరిచయం చేస్తున్న రియాలిటీ షోస్ లో జీ తెలుగు ఛానల్  లో టెలికాస్ట్ అయ్యే సరిగమప ప్రోగ్రాం ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త సింగర్స్ మనకి పరిచయం అవుతున్నారు. వాళ్లలో భరత్ ఒకరు.

ఇప్పటికే షో లో తన పెర్ఫార్మెన్స్ ద్వారా జడ్జెస్ ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించారు భరత్. భరత్ పాట మనం ఇప్పుడు కాదు, కొద్ది సంవత్సరాల క్రితమే విన్నాం. భరత్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితం ఒక పాట ద్వారా మనందరికీ పరిచయమయ్యారు. ఆ పాటే అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మనం సినిమాలోని “కని పెంచిన మా అమ్మకే” పాట.

ఈ పాట రెండు వెర్షన్స్ లో ఉంటుంది. ఒక వెర్షన్ ని హరి చరణ్ పాడారు. ఇంకొక వెర్షన్ చైల్డ్ వెర్షన్. అదే సినిమాలో కూడా ఉంటుంది. ఆ పాటని భరత్ పాడారు. అలా చిన్నప్పుడే మనం సినిమాలో పాట ద్వారా మనకి పరిచయం అయ్యారు.

ఆ పాటని ఇటీవల సరిగమప ప్రోగ్రాంలో కూడా పాడారు భరత్. భరత్ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పాటలతో మనల్ని అలరిస్తూ, ఇంకా తను కూడా మరింత గుర్తింపు, పేరు సంపాదించాలని ఆశిద్దాం.

Watch video :


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com