లవర్ ని కలవడం కోసం రాత్రి 1 కి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లిన “హనుమ విహారి” లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.?

లవర్ ని కలవడం కోసం రాత్రి 1 కి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లిన “హనుమ విహారి” లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

“విజయ లక్ష్మి గారు, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు.” జనవరి 11వ తేదీన హర్ష భోగ్లే చేసిన ఈ ట్వీట్ ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన టెస్ట్ లో తన ఆటతో టీమ్ ఇండియా గెలవడానికి ముఖ్య కారణంగా నిలిచారు హనుమ విహారి. దెబ్బ తగిలినా కూడా లెక్కచేయకుండా తన బ్యాటింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. హనుమ విహారి కాకినాడకు చెందిన వారు.

Video Advertisement

Hanuma vihari love story

హనుమ విహారికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండేదట. హనుమ విహారికి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారు. అప్పటినుంచి హనుమ విహారి తల్లి విజయలక్ష్మి గారు బాధ్యతలు తీసుకున్నారట. 2010 లో 17 సంవత్సరాల వయసులో ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశారు హనుమ విహారి.

Hanuma vihari love story

హనుమ విహారి కి 2019 లో ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రీతి రాజ్ తో వివాహం జరిగింది. ప్రీతి వరంగల్ కి చెందిన వారు. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్. వారిద్దరికీ ఏడు సంవత్సరాల పరిచయం ఉంది. హనుమ విహారి, ప్రీతి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు. ఒక ఇంటర్వ్యూలో హనుమ విహారి వారి ప్రేమకు సంబంధించిన ఒక సంఘటన చెప్పారు.

Hanuma vihari love story

ఒకసారి హనుమ విహారి తన ఫ్రెండ్ తో దాదాపు అర్ధ రాత్రి 1 సమయంలో  హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ లో ఉన్నారట. అప్పుడు హనుమ విహారికి ప్రీతిని కలవాలి అనిపించింది. ప్రీతి వరంగల్ లో తన తల్లిదండ్రులతో ఉంటారు. హనుమ విహారి తన ఫ్రెండ్ తో కలిసి ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్లారు.

Hanuma vihari love story

గేట్ లాక్ వేసి ఉండడంతో ప్రీతి బయటికి రాలేకపోయారు. దాంతో హనుమ విహారి గోడ దూకి లోపలికి వెళ్లారట. ఈ సంఘటనని ఒక ఇంటర్వ్యూలో హనుమ విహారి గుర్తుచేసుకున్నారు. మొదట వీరి పెళ్ళికి ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. తర్వాత వాళ్ళని ఒప్పించి 2019 మే లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Hanuma vihari love story

Hanuma vihari love story

 


End of Article

You may also like