Ads
లైఫ్ అఫ్ రామ్. ఈ పాట గుర్తు చేసుకుంటే మనలో చాలా మందికి గుర్తొచ్చే వ్యక్తి యశస్వి కొండేపూడి. ఈ పాట ద్వారా ఒక్క రోజులో చాలా పాపులర్ అయ్యారు యశస్వి. అప్పటి వరకు ఈ పాటని చాలా మంది వినే ఉంటారు కానీ, యశస్వి పాడిన తర్వాత పాట వినే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ అయ్యారు.
Video Advertisement
అంత మంచి పాట పాడిన యశస్వికి పాపులారిటీ రావడంతో పాటు ఆ పాట కూడా జనాల్లో ఇంకా పాపులర్ అయింది. మనందరికీ యశస్వి కేవలం ఈ ఒక్క పాట ద్వారానే ఫేమస్ అయి ఉండొచ్చు. కానీ ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డారు యశస్వి. యశస్వి కాకినాడ నుండి వచ్చారు.
source : yasaswi kondepudi twitter
ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నారు. చదువుకునేటప్పుడే YK అనే బ్యాండ్ కూడా మొదలుపెట్టారు యశస్వి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. ఒక సారి లెజెండరీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.
యశస్వి కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో కవర్ సాంగ్స్ పాడి పోస్ట్ చేశారు. యశస్వి సోదరి కూడా సింగర్. తన పేరు సంకీర్తన. సంకీర్తన కూడా స్టేజ్ షోస్ లో పాడడంతో పాటు యూట్యూబ్ లో కూడా కవర్ సాంగ్స్ పాడి అప్లోడ్ చేస్తుంటారు.
సరిగమప లో యశస్వి పాడిన లైఫ్ ఆఫ్ రామ్ పాట పర్ఫామెన్స్ చూసిన హీరో శర్వానంద్ కూడా యశస్వి ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఒక ఇంటర్వ్యూలో ఇంకా చాలా మంది సెలబ్రిటీలు తనని అభినందించారు అని, అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వచ్చాయని యశస్వి చెప్పారు.
https://www.youtube.com/watch?v=Nq03cnXkzTg
End of Article