కొడుకుని సరుకులు తెమ్మని తల్లి పంపిస్తే పెళ్లి చేసుకొని వచ్చాడు.

కొడుకుని సరుకులు తెమ్మని తల్లి పంపిస్తే పెళ్లి చేసుకొని వచ్చాడు.

by Anudeep

Ads

పీత కష్టాలు పీతవి..సీత కష్టాలు సీతవి అన్నట్టు..ఘజియాభాద్ కి చెందిన గుడ్డు కష్టాలు గుడ్డువి..ఈ లాక్ డౌన్ కాలంలో అన్నమో రామచంద్రా అని కొందరు ఏడుస్తుంటే, మందు లేదని మధ్యం ప్రియులు ఏడుస్తున్నారు.. లాక్ డౌన్ తో ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో సతమతమవుతున్నారు. ఇంతకీ గుడ్డు ఎవరు?అతని సమస్యేంటి?? అతని మూలంగా అతని తల్లికి వచ్చిన కష్టం ఏంటి??

Video Advertisement

లాక్ డౌన్ కాలంలో పోలీసులకి చిత్రివిచిత్ర కేసులు ఎదురవుతున్నాయి.ఘజియాబాద్లోని షహిబాబాద్ కి చెందిన ఒక మహిళ కూడా పోలీసుల ఎదుటికి వచ్చి తన మొర పెట్టుకుంది.. ఇంతకీ తన సమస్య ఏంటంటే “నా కొడుకుని సరుకులు తెమ్మని పంపిస్తే, పెళ్లాన్ని వెంటపెట్టుకొచ్చాడు. ఈ పెళ్లిని నేను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించను..” అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ పోలీసులకు వివరించింది తన సమస్య..ఇప్పుడు అర్దమైందా గుడ్డు ఎవరో..ఈ కథలో హీరో.

source: twitter/ANI

ఇరవై ఆరేళ్ల గుడ్డు, సవిత అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు..పెద్దలు అంగీకరించని కారణంగా ఇద్దరు రెండు నెలల క్రితమే రహస్యంగా హరిద్వార్లోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు..కానీ వీరి పెళ్ళికి సాక్షులు లేకపోవడంతో వివాహధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయలేదు సదరు ఆర్యసమాజ్ సంస్థ.. దాంతో సవితను ఢిల్లీలోని రెంట్ ఇంట్లో ఉంచి తను ఇంటికొచ్చేశాడు..

representative image

ఇంటికొచ్చాడనే కాని పెళ్లైనా భార్య ఎక్కడో ఉంది..లాక్ డౌన్ పీరియడ్లో తనెలా ఉందో ఏంటో అనే బాధ, మరోవైపు సవితను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా ఇంటి ఓనర్ ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక  ఎలా అయినా తనని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు గుడ్డు..దాంతో సరుకులు తెమ్మని అమ్మ బయటికి పంపించగానే ,దొరికిందే ఛాన్స్ అని మళ్లీ హరిద్వార్ వెళ్లి  సవితను వెంటపెట్టుకుని ఇంటికి వచ్చాడు.

ఈ పెళ్లికి ఎట్టిపరిస్థతుల్లో ఒప్పుకోను అని ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వాళ్లిద్దరూ మేజర్లు దాంతో పోలీసులు కూడా ఆ పెళ్లిని కాదనలేని పరిస్థతి. దాంతో  ఆ తల్లికి నచ్చచెప్పాలని చూసారు, అయినా కూడా ఆ తల్లి వినకపోవడంతో.. ఆ అమ్మాయి నా గడప తొక్కడానికి వీళ్లేదు అని కరాఖండిగా చెప్పేయడంతో  సవిత ఇంటి ఓనర్ తో మాట్లాడి లాక్ డౌన్ ముగిసే వరకు సవిత , గుడ్డులను ఆ ఇంట్లో ఉండే విధంగా ఒప్పించారు..చివరికి కథ ఇలా ముగిసింది.


End of Article

You may also like