Ads
గత కొన్ని రోజులు గా సౌరవ్ గంగూలీ బయో పిక్ గురించి చర్చ జరుగుతోంది. అయితే.. ఈ విషయమై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించారు. మొత్తానికి, తన బయో పిక్ ను నిర్మించడానికి సౌరవ్ గంగూలీ అంగీకరించారు. భారీ బడ్జెట్ తో మాజీ కెప్టెన్ బయో పిక్ రూపొందబోతోంది. బాలీవుడ్ లో ఈ సినిమా రూపొందనుంది.
Video Advertisement
అయితే.. ఈ సినిమాలో గంగూలీ పాత్రను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పోషించే అవకాశం ఉందని సమాచారం. రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే., ఈ సినిమా రూపొందించడానికి తానూ అంగీకరించానని.. కానీ డైరెక్టర్ పేరు ను ఇప్పుడే చెప్పలేనని.. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని దాదా పేర్కొన్నారు.
End of Article