Ads
మోసాలు జరగని ప్రదేశాలంటూ ఏమీ లేవు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకం గా మోసం జరుగుతూనే ఉంటుంది. మనకు తెలిసిన ప్రదేశాలయితే మనకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మోసపోకుండా ఉండగలం.
Video Advertisement
అదే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అప్రమత్తం గా ఉండక తప్పదు. యూరప్ కు వెళ్లిన ఓ అమ్మాయి తనకు ఎదురైన సంఘటన గురించి వివరిస్తూ.. విదేశాల్లో కూడా ఇలాంటి మోసాలు ఎలా జరిగే అవకాశం ఉందో తెలియచెప్పింది.
ఈ విషయాలను ఆమె ఓ వీడియో లో చెప్తూ.. ఆ వీడియో ను నెట్టింట్లో షేర్ చేసింది. ఆమె ఏమి చెప్పిందో మనం కూడా తెలుసుకుందాం. సాధారణం గా చాలా మంది డెవలప్ అయిన కంట్రీస్ లో మోసాలు పెద్ద గా జరగవు అనుకుంటూ ఉంటారు.
కానీ, అది అవాస్తవం. అక్కడ కూడా చిల్లర మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. బయట తిరుగుతున్నంత సేపు మనం అప్రమత్తం గా ఉండాల్సిందే. ఈ వీడియో లో అమ్మాయి ఓ సారి యూరప్ లో ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మోగించే బెల్స్ చాలా ఫేమస్. వాటిని వినడానికి, చూడడానికి అక్కడకు ఎంతో మంది వస్తుంటారు. ఈ అమ్మాయి కూడా అక్కడకు అలానే వెళ్లి.. ఆ బెల్స్ ను మోగిస్తున్న టైం లో వీడియోస్ ను కూడా షూట్ చేసిందట.
అయితే.. ఆ సమయం లోనే ఆమెను ఓ ఇద్దరు ఆడవాళ్లు చూస్తూ ఉండడం గమనించింది. వారు ఆమె వద్దకు వచ్చి.. మీరు బెల్స్ మోగిస్తున్న టైం లో వీడియో తీశారు కదా.. మేము మిస్ అయ్యాము.. మాకు వీడియోస్ చూపిస్తారా అని అడిగారు. వారు చూడడానికి తల్లి కూతుర్ల లాగా ఉన్నారు.. టూరిస్ట్ బాగ్ లను కూడా వేసుకుని ఉండడం తో ఈమెకు అనుమానం రాలేదట. తీరా వీడియోస్ తీసి చూపిస్తున్న టైం లో.. కూతురు తనని మాటలలో పెట్టేయడం.. ఆ తల్లి ఆమెకు దగ్గరగా రావడాన్ని గమనించింది.
ఆమె వేసుకున్న జీన్స్ లోని పర్సు ను తీయడానికి ఆ తల్లి ప్రయత్నిస్తోంది. వీరు తనను మోసం చేయాలనుకుంటున్నారని గుర్తించిన ఆ అమ్మాయి వారికి దూరం గా జరిగి ప్రమాదాన్ని అడ్డుకోగలిగింది. సాధారణం గా మన విదేశాలు వెళ్ళినపుడు డబ్బుతో పాటు విలువైన వీసా కార్డులను కూడా పర్సు లలోనే పెట్టుకుంటాం. ఇలాంటి మోసాల బారిన పడి విలువైన వస్తువులను పోగొట్టుకోకండి. కొత్త చోటుకు వెళ్లిన సమయాల్లో.. నలుగురిలో తిరుగుతున్న సమయాల్లో అప్రమత్తం గా ఉండడం మర్చిపోకండి.
Watch Video:
End of Article