Ads
‘ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు’ అంటూ 2001లో మొదలైన ‘అమృతం’ సీరియల్ దిగ్విజయంగా ఆరు సంవత్సరాల పాటు బుల్లితెర పై ప్రసారం అయ్యి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పటికీ అమృతం పేరు వినిపిస్తే అమృత రావు అమాయకత్వం, ఆంజనేయులు ఐడియాలు, అప్పాజీ పెనాల్టీలు గుర్తొచ్చి నవ్వుకునే ఆడియెన్స్ ఉన్నారు.
Video Advertisement
అమృతం ప్రసారం అయిన 11 సంవత్సరాల తరువాత ‘అమృతం ద్వితీయం’ కూడా వచ్చింది. అయితే దీనిలో అప్పటి ఆంజనేయులుగా చేసిన గుండు హనుమంతరావును ఆడియెన్స్ మిస్ అయ్యారు. అమృతంలో తనదైన శైలిలో కడుపుబ్బ నవ్వించిన, గుండు హనుమంతరావు చెప్పిన డైలాగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుణ్ణం గంగరాజు రూపొందించిన అమృతం సీరియల్ కు డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ జెమిని టీవిలో 2001లో నవంబర్ 18న మొదలైంది. 2007 నవంబర్ 18 వరకు 313 ఎపిసోడ్‌లలో 6 సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రసారం చేయబడింది. అప్పట్లో సండే వచ్చిందంటే, రాత్రి టెలివిజన్ లో అమృతం సీరియల్ అలరించేది. ఇంటిల్లిపాది కూర్చుని, అమృతం చూసేవారు.
సీరియల్ సాంగ్ తో మొదలయిన నవ్వులు ఆంజనేయులు (గుండుహనుమంతరావు) ఆలోచనలు, అమృత రావు అమాయకత్వం, ఇంటి ఓనర్ అప్పాజీ వేసే పెనాల్టీలు, సర్వం, ఇలా ప్రతిదీ ఆడియెన్స్ ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేది. అయితే తాజాగా ఆంజనేయులు పద్దుతో చెప్పిన ఒక డైలాగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా గురించే అప్పుడే చెప్పారు అన్నట్టుగా ఈ వీడియో సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇటీవల రిలీజ్ అయిన భోళా శంకర్ మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు విజయం సాధించలేదు. ఈ మూవీ పై నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మెహర్ రమేష్ ను నమ్మి మూవీలో నటించాడనే టాక్ ఉంది. అదే విషయాన్ని అప్పట్లో ప్రసారం అయిన అమృతంలో ఆంజనేయులు చెప్పినట్టుగా షేర్ చేశారు. ఆ వీడియోలో ‘ఆ బాస్ ఎప్పుడు అంతే ఎవరు ఏం చెప్తే అది నమ్మేస్తాడు భోళా శంకరుడు’ అని ఆంజనేయులు చెప్తాడు.
https://twitter.com/Movies4u_Officl/status/1709083723592020256
Also Read: 30 ఏళ్ల స్టార్ డం… కానీ ఇప్పుడు..? అసలు ఈ హీరోయిన్ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది..?
End of Article