చాక్లెట్ ఇలా కూడా తింటారా..? ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

చాక్లెట్ ఇలా కూడా తింటారా..? ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

by Anudeep

Ads

టీవీ ల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది.

Video Advertisement

అయితే కొన్ని సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అయితే తాజాగా ఒక తమిళ సీరియల్ లో ని ఒక సీన్ వైరల్ గా మారింది. తమిళ్ లో సన్ టీవీ లో రోజా అనే ఒక సీరియల్ లో తెలుగు అమ్మాయి ప్రియాంక టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇందులో ఒక అమ్మాయి కి ఆమె భర్త చాక్లెట్ తెచ్చి ఇస్తారు. ఆమె ఫాస్ట్ గా ఆ చాక్లెట్ తినేస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి నాకు చాక్లెట్ కావాలని అడగ్గా.. లేదు అని చెప్తుంది ఆ అమ్మాయి. దీంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయి బుగ్గల్ని పట్టుకొని నొక్కితే చాక్లెట్ వెళ్లి ఆ అబ్బాయి నోట్లో పడ్తుంది.

funny scene from a tamil serial..

దీంతో ఈ సీన్ చూసిన నెటిజన్లు చాక్లెట్ ఇలాగే తినాలేమో.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సన్నివేశం పై మరికొందరు నెటిజన్లు ట్రోల్స్ గుప్పిస్తున్నారు. రియాలిటీ కి దూరంగా ఉన్న ఈ సీన్ చూసి నెట్టింట పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి లాజిక్ లెస్ సీన్లు ఎక్కువగా హిందీ సీరియల్స్ లో వస్తుంటాయి. వాటిని మనవాళ్ళు చూసి నవ్వుకోవడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అన్ని భాషల సీరియల్స్ లో కూడా వాటిని చూసి అలాంటి సీన్లే తీస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

funny scene from a tamil serial..

ఈ సీన్ మాత్రమే కాదు ఇంతకు ముందు ఈ సీరియల్ కి సంబంధించిన మరొక సీన్ కూడా ఇలా ట్రోల్స్ కి గురైంది. ఈ సీరియల్ లోని ఒక స్త్రీ పాత్ర గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నట్లు చూపించారు. అయితే… చనిపోయిన మహిళ ముఖాన్ని హీరోయిన్ ముఖంతో రీప్లేస్ చేసినట్లు చూపించారు. దీంతో రోడ్ మీదే ప్లాస్టిక్ సర్జరీ చేసారంటూ ఆ సీరియల్ పై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది.

watch video :


End of Article

You may also like