“బట్టలు” ఇలా కూడా ఆరబెడతారా..? ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

“బట్టలు” ఇలా కూడా ఆరబెడతారా..? ఈ “సీరియల్” సీన్ చూస్తే నవ్వాపుకోలేరు..!

by Anudeep

Ads

టీవీ ల్లో అన్నిటికంటే ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటి అంటే అవి సీరియల్స్ మాత్రమే..ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో వేల సీరియల్స్ వచ్చాయి.. వస్తున్నాయి కూడా. ఇందులో కొన్ని డబ్బింగ్ సీరియల్స్ ఉంటాయి.. కొన్ని రీమేక్ సీరియల్స్ ఉంటాయి. వీటన్నిటిని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఇందులో చాలా వరకు ప్రేక్షకులకు నచ్చుతున్నాయి కూడా. దాంతో వీటి పాపులారిటీ సోషల్ మీడియా వరకూ పాకింది.

Video Advertisement

అయితే ఈ మద్య కాలం లో సీరియల్స్ ని లాజిక్స్ కి దూరంగా.. తెలివి లేకుండా తీస్తున్నారు. వీటిని చూస్తున్న నెటిజన్లు వాటిని వైరల్ చేస్తున్నారు. దీంతో చాలా సీరియల్స్ లోని సీన్లు రియాలిటీ కి దూరంగా ఉంటూ నెట్టింట ట్రోలింగ్ కి గురవుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ లో బట్టలు డ్రై చేయడానికి ఒక అమ్మాయి మైక్రోవేవ్ ఒవేన్ ని వాడటం తో ఆ సీన్ కాస్తా వైరల్ గా మారింది. ఇంతకు ముందు ఇటువంటి వాటిని జనాలు పట్టించుకొనే వారు కాదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాభవం పెరగడం తో ఇటువంటి సీన్ల పై ట్రోల్స్ పెరుగుతున్నాయి.

trolls on hindi serial goes viral..

హిందీ సీరియల్ ‘సాథ్ నిభానా సాథియా’ స్టార్ ప్లస్ లో ప్రసారం అవుతోంధి. ఈ సీరియల్ ని తెలుగులో ‘కోడలా కోడలా కొడుకు పెళ్ళామా..’ అనే పేరుతో డబ్బింగ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులని కూడా అలరించింది. ఈ సీరియల్ లో ఎన్నో జెనెరేషన్స్ మారినా.. ఇప్పటికి దీన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన సీన్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సీరియల్ లో రాధా అనే ఒక అమ్మాయి హీరో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలు. ఆమెకు ఏ వస్తువు ఎలా వాడాలో తెలియదు.

trolls on hindi serial goes viral..

అయితే ఆ అమ్మాయిని బట్టలు డ్రైయర్ లో వెయ్యమని చెప్తారు. ఆ అమ్మాయికి అది తెలియక.. కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మైక్రోవేవ్ ఒవేన్ లో ఆ బట్టలను పెట్టి స్విచ్ వేస్తుంది. దీంతో మైక్రోవేవ్ ఒవేన్ నుంచి పెద్ద శబ్దం వచ్చి.. పొగ మంటలు వస్తాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఈ సీరియల్ కి సంబంధించిన ఒక సీన్ ట్రోల్స్ కి గురైంది. హీరోయిన్ గోపిక ఒక సారి హీరో లాప్టాప్ ని క్లీన్ చేస్తా అని చెప్పి.. సబ్బు తో తోముతుంది. దీనిపై కూడా నెటిజన్లు ఫన్నీ గా స్పందించారు.

 

watch video:

https://www.instagram.com/reel/Co1O5CWII6O/?igshid=YmMyMTA2M2Y%3D


End of Article

You may also like