ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..! ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..! ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika Singaluri

Ads

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలతో పాటు, సీరియల్స్ కి కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. ఒకరకంగా సీరియల్స్ కే ఇంకా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సీరియల్స్ లో నటించే వారిని తమ ఇంట్లో వారిలాగా భావిస్తూ ఉంటారు. సీరియల్స్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ వస్తూ ఉంటాయి.

Video Advertisement

కొన్ని సీరియల్స్ లో మాత్రం కొన్ని సీన్స్ మీద కామెంట్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. అలా ఇటీవల జరిగింది. జీ తెలుగులో వచ్చే త్రినయిని సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో హీరోయిన్ కి కొన్ని శక్తులు ఉంటాయి. హీరోయిన్ తో పాటు ఉన్న నాగదైవం, హీరోయిన్ కి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారి నుండి కాపాడుతూ ఉంటారు.

scene from trinayani serial latest episode

అయితే ఈ సీరియల్ లో ఇటీవల ఒక సీన్ టెలికాస్ట్ చేశారు. అందులో విలన్ నుంచొని ఉంటే, పాము కార్ డ్రైవ్ చేస్తున్నట్టు చూపించారు. ఇది గ్రాఫిక్స్ ద్వారా తీసిన సీన్. చూస్తుంటే ఇది అర్థం అవుతోంది. కానీ, దేవుడు త్రినయిని ని కాపాడుతారు అని ఇంకొక రకంగా చూపిస్తే బాగుండేది అంటూ చాలా మంది అంటున్నారు. ఎందుకంటే, ఈ సీన్ మీద కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంతకుముందు కూడా ఈ సీరియల్ లో ఇలాగే ఒక సీన్ జరిగింది. సీరియల్ లో ఉండే ఒక నటి ఉయ్యాల కోసం చీరని కట్టి ఫోన్ వస్తుంది అని వెళ్ళిపోతుంది. ఇదంతా పైన ఫ్లోర్  లో అవుతూ ఉంటుంది.

కింద ఫ్లోర్ లో కూర్చున్న విలన్ పాత్ర పోషిస్తున్న నటి లేచి నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, పైన ఉన్న చీర కిందకి పడిపోయి, ఉరి పట్టినట్టు ఆమె మెడకి పడుతుంది. ఈ సీన్ మీద కూడా అలాగే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ సీరియల్ లో ఇలాంటి సీన్స్ చాలానే జరిగాయి. కేవలం ఈ సీరియల్ లో మాత్రమే కాదు. ఇలాంటి సీన్స్ చాలా సీరియల్స్ లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సీరియల్ లో మాత్రం ఇది మొదటి సారి కాదు. అంతకుముందు కూడా ఇలాంటి సీన్స్ జరగడం, వాటి మీద సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం అయ్యాయి. ఇప్పుడు ఈ సీన్ మీద కూడా అలాగే కామెంట్స్ వస్తున్నాయి.

watch video :

ALSO READ : PAWAN KALYAN ASSETS: పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఎంత..? అప్పులే ఎక్కువ..?


End of Article

You may also like