Home serials ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anudeep

జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘త్రినయని’ సీరియల్ 2020 మార్చిలో మొదలైంది. ఇందులో ఆషికా పదుకొనే, చందుగౌడ, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సీరియల్లో నయని అనే అమ్మాయికి జరగబోయే ప్రమాదం ముందే ఊహించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఆమెకు ఆత్మలతో కూడా మాట్లాడే శక్తి ఉంది.అలా హీరో తల్లి చనిపోయి ఉండగా ఆ ఆత్మ నయని తో మాట్లాడుతుంది. తన కొడుకు విశాల్ ను రక్షించమని ముందే నయనికి హెచ్చరిస్తూ ఉంటుంది.

జీ తెలుగులోని టాప్ సీరియల్స్ లో ఒకటైన ఈ సీరియల్ పై ఇప్పటికే నెట్టింట పలు ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సీరియల్ లో మూఢనమ్మకాలకు సంబంధించిన సన్నివేశాలను బాగా చూపిస్తూ ఉంటారు. ఇదివరకు ఇలాంటి వాటిపై చాలా మంది ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసారు కూడా. అలాగే ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర అయిన నయని పాములతో.. ఎద్దులతో.. చిలుకలతో మాట్లాడుతుందని కూడా ఇంతకు ముందు చూపించారు. దీనిపై కూడా నెట్టింట ట్రోల్స్ వచ్చాయి.

unrealistic scenes in telugu serials..

అయితే తాజాగా ఆ సీరియల్ కి చెందిన సన్నివేశం ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ సీరియల్ లో నటి విష్ణు ప్రియ హాసిని పాత్రలో నటిస్తోంది. ఆ సన్నివేశం లో హాసిని తన బిడ్డ తో ఆడుతూ.. ఒక చీరకి ముడివేసి ఇప్పుడే వస్తా అంటూ ఎక్కడికో వెళ్తుంది. ఇంతలో ఆ చీర కిందకి జారి.. ఆ సీరియల్ లో నెగటివ్ పాత్ర చేస్తున్న తిలోత్తమ మెడకి చుట్టుకుంటుంది. ఆ చీర ఆమె మెడకి చుట్టుకోవడం తో పాటు.. మెడకి బిగుసుకుపోయి ఆమె గిల గిలా కొట్టుకుంటూ గాల్లోకి వెళ్ళిపోతుంది.

unrealistic scenes in telugu serials..

దీంతో ఈ సన్నివేశాన్ని చూసిన నెటిజన్లు ట్రోల్స్ గుప్పిస్తున్నారు. రియాలిటీ కి దూరంగా ఉన్న ఈ సీన్ చూసి నెట్టింట పలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి లాజిక్ లెస్ సీన్లు ఎక్కువగా హిందీ సీరియల్స్ లో వస్తుంటాయి. వాటిని మనవాళ్ళు చూసి నవ్వుకోవడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు సీరియల్స్ కూడా వాటిని చూసి అలాంటి సీన్లే తీస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

watch video :

 

View this post on Instagram

 

A post shared by Poolachokka (@poolachokkaa)

You may also like