మంచు విష్ణు “కన్నప్ప” టీజర్‌లో ఈ మిస్టేక్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

మంచు విష్ణు “కన్నప్ప” టీజర్‌లో ఈ మిస్టేక్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Harika

Ads

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో ఎంతో మంది నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, నయనతార వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఎంతో మంది కూడా ఈ సినిమాలో అతిధి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

scene in manchu vishnu kannappa teaser

హీరోయిన్ మధుబాల, బ్రహ్మానందం, వాణి భోజన్, దేవరాజ్, ముఖేష్ రిషి, శివ బాలాజీ, మలయాళం నటుడు రాహుల్ మాధవ్, కౌశల్, రఘుబాబు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ లో ఒక సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఒక సీన్ లో మంచు విష్ణు బాణం వేస్తారు. బాణం గురి ఒక వైపుకి ఉంటుంది. కానీ మంచు విష్ణు మరొక వైపు చూస్తూ ఉంటారు. అంటే, మంచు విష్ణు కెమెరా వైపు చూస్తూ ఉంటారు. ఈ సీన్ స్లో మోషన్ లో చూపించారు. దాంతో మంచు విష్ణు కెమెరా వైపు చూడటం ఈ సీన్ లో చూపించారు. దాంతో, ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

ఇటీవల జరిగిన కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా టీజర్ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్క్రీనింగ్ కి మంచు విష్ణుతో పాటు, విరోనికా, మోహన్ బాబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా వెళ్లారు. అక్కడ ఈ టీజర్ ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు విడుదల చేశారు. ఎన్నో ఫారిన్ లొకేషన్స్ లో సినిమా షూటింగ్ జరుపుకుంది. లొకేషన్స్ గురించి కూడా దాదాపు 5 సంవత్సరాల నుండి వెతికారు. ఎంతో హోం వర్క్ చేసిన తర్వాత ఈ సినిమాని రూపొందించడం మొదలుపెట్టారు. దాంతో ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like