లాక్ డౌన్ వేళ స్కూల్ ఫీజు గురించి ఫోన్ చేస్తే…ఆ స్టూడెంట్ తండ్రి హైలైట్ కౌంటర్..!

లాక్ డౌన్ వేళ స్కూల్ ఫీజు గురించి ఫోన్ చేస్తే…ఆ స్టూడెంట్ తండ్రి హైలైట్ కౌంటర్..!

by Anudeep

నెల ,రెండు నెలల ముందే వేసవిసెలవులొచ్చేశాయి పిల్లలందరూ హ్యాపీ, మొన్నటికి మొన్నే ఎగ్జామ్స్ లేకుండానే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తారనగానే ఎగిరి గంతేశారు పిల్లలతో సహా వారి తల్లిదండ్రులు కూడా..ఆ సంతోషం రెండు రోజులు కూడా నిలవకుండానే ఆన్లైన్ క్లాసులు, వర్క్ షీట్స్ అంటూ పిల్లలపైన వత్తిడి ప్రారంభమైంది.. ఆఖరికి ఆన్లైన్ క్లాసులకు కూడా స్కూల్ యూనిఫాం వేసుకోవడం కంపల్సరీ..ఇదేం శాడిజం రా బాబు..ఇదే కాదు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది.

Video Advertisement

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్ డౌన్ ప్రకటన  నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ చేసిన విషయం తెలిసిందే, విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసెస్ కండెక్ట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే .. కానీ కొన్ని స్కూల్స్ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాయి.. యూనిఫాం వేసుకోవాలని,ఉదయం ప్రేయర్ కి అటెండ్ కావాలని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆన్లైన్లో కనపడాలని..ఇదెక్కడి విడ్డూరం..ఇవన్ని పాటించకపోతే పిల్లలకు ఫోన్స్ చేసి బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.. సోషల్ మీడియాలో వైరలవతున్న ఒక ఆడియో ఆ వాదనలకు బలం చేకూరుస్తుంది.

మరో వైపు తల్లిదండ్రులను ఫీజ్ చెల్లించమని ఒత్తిడి.. తమ పిల్లలు బాగుండాలని ఫీజుల భారం అయినా కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. నెల గడిస్తే ఉండేవాడెవడో ,పోయేవాడెవడో.. తినడానికి తిండి దొరక్క తిప్పలు పడుతున్న కాలం ఇది,పనులు లేక ఎక్కడిక్కడ స్తంబించిపోయిన కాలం ఇలాంటి టైంలో ఫీజ్ ఎలా పే చేస్తారు..ఇదే విషయాన్ని ఆ కాల్ రికార్డింగ్లో తండ్రి ప్రస్తావించారు.ఫీజ్ కట్టండి అన్న స్కూల్ టీచర్ కి కట్టం అని తెగేసి చెప్పాడు.. ఏకంగా ముఖ్యమంత్రికే ట్వీట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఈ కాల్ రికార్డింగ్ నిజమో కాదో కాని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నట్టుగా ఉంది.పెరుగుతునన పోటీ వాతావరణం ,తమ పిల్లలు వెనకపడకూడదనే ఆలోచన కరెక్టే కానీ ,పిల్లలపైన ఈ  ఒత్తిడి ఎంతవరకు కరెక్ట్?? ఈ ఆన్లైన్ క్లాసులు, ప్రైవేట్ స్కూల్స్ వైఖరిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి..

watch video:


You may also like

Leave a Comment