లాక్ డౌన్ వేళ ఎక్కువ మంది సెర్చ్ చేసే వంట ఇదే అంట..!

లాక్ డౌన్ వేళ ఎక్కువ మంది సెర్చ్ చేసే వంట ఇదే అంట..!

by Anudeep

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల,కుక్కపిల్ల కాదేది కవితకనర్హం అని మహాకవి అన్నట్టు.. లాక్ డౌన్ పీరియడ్లో కాదేది ప్రయోగానికి అనర్హం ..ఇన్ని రోజులు స్ట్రీట్ ఫుడ్ కి అలవాటు పడ్డ జీవులు, తినాలనిపించగనే టక్కున పూడ్ ఆర్డర్ ఇచ్చే ప్రాణులన్ని ఇప్పుడు గిలగిలా కొటుకుంటున్నాయి..ఇక తెగించాల్సిందే అన్నట్టుగా పావ్ బాజీ, నూడుల్స్, డోక్లా, హలీమ్ , పానీపూరి ఇలా  కాదేది రెసిపికి అనర్హం అని ఇంట్లోనే చేసుకుని తినడానికి ప్రిపేర్ అవుతున్నారు..

Video Advertisement

మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టుగా వారి వారి టాలెంట్ తో వంటల ప్రయోగాలు చేస్తున్నారు..వీటిల్లో పానీపూరిది టాప్ ప్లేస్.. టేస్ట్ లోనే కాదు..గూగుల్ సెర్చింగ్లో కూడా.. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేసిన రెసిపి “పానీపూరీ”… పానీపూరి ఆ మజాకా… పానీపూరీపై, పానీపూరి లవర్స్ పై వచ్చినన్ని ట్రోల్స్, టిక్ టాక్స్, ఫన్ని వీడియోస్ మరే పూడ్ లవర్స్ పై వచ్చుండవు..

ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా కూడా బయట తిరగాలన్నా, బయట ఫూడ్ తినాలన్నా కొంచెం భయమే కాబట్టి మీరు కూడా ఆ విధంగా ముందుకు పొండి..పానీపూరీ చేసుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు..ఒకట్రెండు సార్లు చేస్తే మీరే ఒక కంక్లూజన్ కి వస్తారు.. ఆలుకుర్మా చేసినంత ఈజీగా హలీమ్, పచ్చిపులుసు చేసినంత సింపుల్ గా పానీ పూరీ చేసేయోచ్చని..

ఇంతకీ పానీ పూరి చాలా సింపుల్ గా చేసే పద్దతి చెప్పాలా..
ముందుగా పానీ కోసం..పచ్చిమిర్చి,పూదీనా,కొత్తిమీర, నానబెట్టిన చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మిక్సిలో పేస్ట్ చేసుకోవాలి..ఈ పేస్ట్ కి వాటర్ కలుపుకుంటే సరి..

కర్రీ కోసం : ఆలుగడ్డ ఉడకపెట్టుకోవాలి..బఠాని కూడా ఉడకపెట్టుకోవాలి..ఆ రెండింటిలోకి చాట్ మసాలా, ధనియా పొడి, ఉప్పు,కారం వేసి కలుపుకోవాలి.. కొంచెం లూస్ ఉండాలి అంటే ముందు తయారు చేసుకున్న పానీ కలుపుకోవాలి.

 

పూరీ  ఎలా? …………మార్కెట్లో ఆల్రెడీ తయారు చేసిన పూరి ప్యాకెట్ తెచ్చుకోవచ్చు, లేదంటే పూరీ పాపడ్ తెచ్చుకుని ఇంట్లో ఆయిల్ ఫ్రై చేసుకునైనా తయారు చేసుకోవచ్చు..అది కాదంటే మైదా లేదా గోధుమ పిండి తీసుకుని అందులోకి ఉప్మారవ్వ ఒక స్పూన్ కలిపి, ఆయిల్ వేసి చపాతి పిండిలా కలుపుకుని చపాతిలా చేసుకుని చిన్నచిన్న పూరిల్లా ఏదైనా మూతతో అయినా కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి..ఆయిల్ బాగా వేడిగా ఉండాలి..ఒక్కొక్క పూరీ వేయాలి..పూరి వేసి పైన వత్తి వెనక్కి తిప్పాలి..పూరి బాగా పొంగుతుంది..

ఉల్లిగడ్డ రేట్ ఎలాగూ తక్కువే ఉంది కాబట్టి ఒకటి కట్ చేసి పెట్టుకుంటే సరి…..వీటన్నింటిని ఏ కొలతలో తీసుకోవాలి అనే డౌట్ ఉంటే అది మీ ఇంట్లో ఉన్న మనుషుల సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది..

 


You may also like

Leave a Comment