Ads
ఏపీ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Video Advertisement
అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఆరోపణల పై ఆంద్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసినపుడు చందబాబు పై నమోదు చేసిన సెక్షన్లు ఏమిటో? ఆ సెక్షన్ల కింద ఎలాంటి శిక్షలు పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) క్రింద నోటీసు ఇచ్చి, ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే చంద్రబాబు మీద సెక్షన్ 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్లు, ఇవి కాకుండా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2) రెడ్ విత్ 13(1)(సి), (డి) కింద కేసును రిజిస్టర్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడి పై పై పెట్టిన ఆ సెక్షన్లు ఏమిటి? అవి ఏం చెబుతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం పై తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడుతూ, ఈ సెక్షన్లను ఎలాంటి సందర్భంలో పేర్కొంటారు అనేది, ఆ సెక్షన్లు రుజువైతే ఎలాంటి శిక్షలు పడుతాయనే విషయాన్ని వివరించారు. ‘ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్లు అని సీఐడీ నోటీసులుఇచ్చింది. అంటే బెయిల్ రాకూడదనే విధానంలో కేసులు పెట్టినట్లుగా, ఈ సెక్షన్లు, తీవ్రతను బట్టి శిక్ష పడే అవకాశం ఉంటుందని ’ అని చెప్పారు.
- 120(బి) సెక్షన్: నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తితో కలిసి కుట్ర చేయడం. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా అయితే జీవిత ఖైదు లేదా 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కఠిన కారాగార శిక్ష విధించే ఛాన్స్ ఉంటుంది.
- 166సెక్షన్: ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఉండి, చట్ట వ్యతిరేకంగా సంస్థకి, లేదా ఒక వ్యక్తికి నష్టం చేసినపుడు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. నేరం రుజువైతే సంవత్సరం వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుంది.
- 167సెక్షన్: ప్రజాప్రతినిధిగా ఉండి అధికారిక పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పేపర్లను తారుమారు చేయడం, డూప్లికేట్ పత్రాలు తయారు చేయడం వల్ల వ్యక్తి లేదా సంస్థకు నష్టం చేయడం. నేరం రుజువైతే 3 ఏళ్ల జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుంది.
- 418సెక్షన్: మోసం చేయడం. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అగ్రిమెంట్ ద్వారా నేరస్థులను రక్షించడం కోసం మోసానికి పాల్పడడం. నేరం రుజువు అయితే 3 ఏళ్ల జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
- 420సెక్షన్: మోసం చేయడం, విలువైన వస్తువు లేదా ఇతరుల ఆస్తిని లాక్కోవడం, లాంటి వాటికి పాల్పడే వ్యక్తి ఈ సెక్షన్ కింద నేరస్తులు. నేరం రుజువైతే గరిష్ఠంగా 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
- 465సెక్షన్: ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్. బెయిలబుల్ సెక్షన్ కిందకు వస్తుంది. 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుంది.
- 468సెక్షన్: డూప్లికేట్ పత్రం లేదా ఎలక్ట్రానిక్ పత్రం మోసం చేయడానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేయడం. ఈ సెక్షన్ కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
- 471సెక్షన్: నకిలీ పత్రం అని తెలిసి, మోసపూరితంగా ఆ పత్రాన్ని ఉపయోగించినపుడు దీనిని వాడతారు. ఇది కూడా బెయిలబుల్ సెక్షన్. మోసాన్ని బట్టి శిక్షవిధిస్తారు.
- 409సెక్షన్: ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ ఉద్యోగిగా, వ్యాపారిగా, బ్యాంకర్‌గా, భాగస్తులుగా, అటార్నీగా, ఏజెంట్‌గా,బ్రోకర్‌గా ఒక ఆస్తి పై బాధ్యత ఉన్నప్పుడు, ఆ బాధ్యతను మరచి, నమ్మక ద్రోహానికి పాల్పడితే ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి 10 ఏళ్ల ఖైదు లేదా జీవిత ఖైదు, జరిమానా విధించవచ్చు.
- 201సెక్షన్: నేరానికి సంబంధించిన ఆధారాన్ని తారుమారు చేయడం. నేర తీవ్రతను బట్టి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు.
- 109 రెడ్ విత్ 34, 37 సెక్షన్స్: ఏదైనా నేరాన్ని కావాలని చేయడం లేదా నేరం చేసెట్టు ప్రేరేపించడం.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్స్ : అవినీతి నిరోధక సెక్షన్లు. నేర తీవ్రతను బట్టి శిక్షలు విధిస్తారని లాయర్ లక్ష్మీనారాయణ వివరించారు.
watch video:
End of Article