ట్రైన్ లో లోయర్ బెర్త్ కావాలా ..? అయితే ఇలా ట్రై చేయండి.!

ట్రైన్ లో లోయర్ బెర్త్ కావాలా ..? అయితే ఇలా ట్రై చేయండి.!

by Anudeep

Ads

సీనియర్ సిటిజన్లు ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టం . అందులోనూ రైలు ప్రయాణాలంటే టికెట్లు పొందడానికే యుద్ధం చేయాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైళ్లలో సీనియర్ సిటిజెన్లు సురక్షితంగా ప్రయాణాలు చేయడానికి రైల్వే శాఖ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అంతే కాకుండా వారికి సీట్ల రేజర్వేషన్లో రాయితీలతో పాటు ప్రత్యేకంగా వారి కోసం లోయర్ బెర్త్లు కేటాయిస్తారు.

Video Advertisement

తాజాగా ఓ సీనియర్ సిటిజెన్లకు అప్పర్ బెర్త్ కేటాయించడంతో వారి కుటుంబ సభ్యుడొకరు రైల్వే శాఖను టాగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో రైల్వే శాఖ తాము సీనియర్ సిటిజెన్ల కోసం పెట్టిన ప్రత్యేక పథకాల గురించి వివరించారు. తమ కుటుంబం లోని ఇద్దరు సీనియర్ సిటిజన్లు టికెట్ బుక్ చేయగా వారికి అప్పర్ బెర్త్లు కేటాయించారు అని ఓ ట్విట్టర్ యూసర్ రైల్వే శాఖను టాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో రైల్వే శాఖ స్పందించింది. . రైల్వే టికెట్ బుకింగ్ పూర్తి నియమాలను తెలిపింది.

భారతీయ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్లో 45 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణీకులకు ఆటోమేటిక్ గా లోయర్ బెర్త్ లు కేటాయించబడతాయి. మీరు లోయర్ బెర్త్ ఆప్షన్ ను ఎంచుకోకపోయిన ఆటోమెటికగా కేటాయిస్తారు. దీనికోసం స్లీపర్, ఏసి క్లాస్ రెండింటిలోనూ లోయర్ బెర్త్ లు రిజర్వు చేసారు. స్లీపర్ క్లాస్ లో ఒక్కో కౌచ్లో ఆరు లోయర్ బెర్త్లు , ఎసి త్రీ టయర్, 2 టయర్ క్లాస్ లో ఒక్కో కౌచ్ కి మూడు లోయర్ బెర్త్లు సీనియర్ సిటిజన్లకు కేటాయించబడతాయి.ఒకవేళ మీరు సీనియర్ సిటిజెన్లు కాకపోయినా లోయర్ బెర్త్ టికెట్ పొందాలి అనుకుంటే రైల్వే వెబ్సైటులో లోయర్ బెర్త్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది . తర్వాత రైల్వే నిబంధనల ప్రకారం మీకు లోయర్ బెర్త్ పొందొచ్చు.


End of Article

You may also like