వ్యవసాయంపై ఆధారపడి బతికే కుటుంబాల్లో చాలా మంది నిరుపేదలే.. నిరక్షరాస్యులే.. అలాంటి ఓ కుటుంబం లోనే పుట్టింది సీమా కుమారి. ఆడపిల్ల కావడం తో కొంత వయసు వచ్చాక ఆమెకు పెళ్లి చేస్తే బరువు తగ్గుతుందని ఆమె తల్లి తండ్రులు భావించారు. కానీ.. ఆమె పట్టు వదలకుండా చదువుకుంది. ఫుట్ బాల్ కూడా నేర్చుకుంది. కోచ్ గా రాణించింది. ఆమె ప్రతిభకు తాజాగా అసలైన గుర్తింపు లభించింది.

seema kumari 1

ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ ఆమె ప్రతిభను గుర్తించి స్కాలర్ షిప్ అందుకునేలా చేసింది. ఈ తరం విద్యార్థులకు ఆమె యూత్ ఐకాన్ గా నిలిచింది. నవ్యా నవేలి నంద, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు. జార్ఖండ్ లో “యువ” అనే ఓ పాఠశాల ఉంది. జార్ఖండ్ చుట్టూ పక్కల గ్రామాల్లోని ప్రజలను అభ్యుదయం వైపు నడిపిస్తూ.. ఆడపిల్లలను చదువుకుని అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లడమే ఈ పాఠశాల లక్ష్యం. సీమా కూడా ఈ పాఠశాలలోనే తల్లితండ్రులను ఒప్పించి చదువుకుంది.

seema kumari 2

ఫుట్ బాల్ పై ఆమెకు మక్కువ ఎక్కువ. ఈ క్రమం లోనే ఆమె ఫుట్ బాల్ కోచ్ గా కూడా మారింది. ఈ క్రమం లో కూడా ఆమె వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రీడల్లో భాగం గా ఆమె వేసుకునే షార్ట్స్ వలన కూడా ఆమె ఎన్నో సార్లు విమర్శలను భరించాల్సి వచ్చింది. అయినా పట్టు సడలకుండా ఆమె తన లక్ష్యం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె ప్రతిభను గుర్తించిన హార్వార్డ్ ఆమెకు సీటు ఇవ్వడమే కాక.. పూర్తి స్కాలర్ షిప్ కు ఎంపిక చేసింది. హార్వర్డ్ మాత్రమే కాదు.. అమెరికా వెర్మాంట్ రాష్ట్రము లో ఉన్న “మిడిల్బరీ కాలేజీ”, హర్యానా లోని “అశోక యూనివర్సిటీ” కూడా ఆమెకు ఆహ్వానం పలికాయి.

seema kumari 3

అమ్మాయిలను చదివిస్తే వారు ఈ ప్రపంచాన్నే మార్చేయగలరంతటి వారవుతారని ప్రియాంక చోప్రా ఆమె గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. “అమ్మాయిలందరికి నీవు ఆదర్శం.. నీవు తీసుకునే నెక్స్ట్ స్టెప్ గురించి ఆత్రుత తో ఎదురు చూస్తున్న…” అంటూ అమితాబ్ మనవరాలు నవ్య నందా ఇన్స్టా లో షేర్ చేసింది.