ఫోటోలకు ఫోజులు ఇచ్చానా? బుద్ది ఉందా మీకు అసలు?

ఫోటోలకు ఫోజులు ఇచ్చానా? బుద్ది ఉందా మీకు అసలు?

by Anudeep

Ads

కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపధ్యంలో ఎక్కడిక్కడ స్తంబించిపోయింది. కానీ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మాత్రం  లాక్ డౌన్ ముందు నుండే తన నియోజక వర్గంలోని ప్రజలకు సేవచేస్తున్నారు.దాంతో ప్రజాప్రతినిధి అంటే మీరు, ఎమ్మెల్యేకి నిర్వచనం సీతక్కా.. ఎవరైనా ఉన్నారా సీతక్కలా ప్రజలకు సేవ చేసేవాళ్లు అంటూ రకరకాల కామెంట్స్ వినిపించాయి..మరోవైపు అవన్ని ఫోటోల కోసం పోజులు అంటూ కొందరు విమర్శస్తున్నారు. ఈ విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క..తన పర్యటనలో తనకు ఎదురైన సమస్యలు వివరించారు.

Video Advertisement

ములుగు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు, తండాలు.. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా ఉండని ప్రాంతాలున్నాయి… కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి..ఆ నియోజకవర్గంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తొలిరోజుల్లో రెండు కేసులు బయటపడ్డాయి .. దాంతో ఆ ప్రాంత ఎమ్మెల్యే సీతక్క, స్వయంగా తానే రంగంలోకి దిగి ప్రజలకు కరోనా వైరస్ గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యక్తిగత శుభ్రత ఎంత అవసరం ఇలా పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. కావలసిన నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు…

అంతేకాదు  లాక్ డౌన్ కాలంలో అందరూ రకరకాల ఛాలెంజ్లతో టైంపాస్ చేస్తుంటే , సీతక్క మాత్రం విభిన్నంగా “గో హంగర్ గో” (ఆకలిని తరిమికొడదాం) పేరిట ఛాలెంజ్ ని ప్రారంభించారు. సీతక్క విసిరిన ఛాలెంజ్ ని తీసుకున్న అనేకమంది తమ వంతుగా ప్రజలకు సాయం చేస్తున్నారు. పగలంతా గ్రామాల్లో పర్యటించడం.ఏ చెట్టు నీడనో తినడం, చీకటి పడితే ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడ పడుకోవడం , గత నలభై ఎనిమిది రోజులుగా ఇదే దినచర్య..ఇదిలా ఉండగా గత రెండురోజులుగా సీతక్క పర్యటన పట్ల నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి, గ్రామంలో సరుకులు అందచేయడానికి వెళ్లిన ఆమెని , అక్కడ నిత్యావసర సరుకులకు పంపిణి లేదని పోలీసులు వెనక్కి పంపేశారు.

వీటిపై స్పందించిన సీతక్క ఫోటో పోజులకోసం అయితే ఒకట్రెండు రోజులు చేస్తే సరిపోయేది, 48 రోజులుగా మేం  ఈ పనులు చేస్తున్నాం, నాతో పాటు మరో పదిమందిమి ఈ పనులు చేస్తున్నాం. మేం గ్రామాల్లో ప్రజల దగ్గరకు వెళ్తున్న క్రమంలో అనేక కష్టాలు పడ్డాం,ఇలాంటి వాటిని అవమానించే విధంగా చేస్తున్న విమర్శలను మీ ఇంట్లో వాళ్లు కూడా హర్శించరు..మీకు అంతగా అనుమానం ఉంటే మాతో రెండు రోజులు గ్రామాల్లోకి రండి, మేం పనులు చేస్తున్నామా, ప్రచారం కోసం చేస్తున్నామా అనేది స్వయంగా చూడండి, అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


End of Article

You may also like