ఆ గ్రామం వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ కేంద్రాలకు సీఎం ఫిదా.!!

ఆ గ్రామం వాళ్ళు స్వయంగా ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ కేంద్రాలకు సీఎం ఫిదా.!!

by Anudeep

Ads

లాక్ డౌన్ తో  ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్లంతా సొంతఊర్లకు చేరుకుంటున్నారు..అలా వచ్చిన వారి కోసం ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి , ఆరోగ్యంగా ఉంటే ఇళ్లకు, లేదంటే హాస్పిటల్స్ కి పంపిస్తున్నరు..ఈ క్వారంటైన్ ఏర్పాట్లన్ని ప్రభుత్వాలే చూసుకుంటున్నాయి..వాటి నిర్వహణ,అక్కడ సౌకర్యాలు ఇతరత్రా వ్యవహారాలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి..కాని టుంజాయ్ గ్రామ వాసులు మాత్రం భిన్నంగా ఆలోచించారు..స్వయంగా క్వారంటైన్ ఏర్పాట్లు చేస్కున్నారు.. ఇంతకీ  ఎక్కడ ఈ గ్రామం? వాళ్లేం చేసారు అనేది తెలుసుకుందామా??

Video Advertisement

మణిపూర్ రాష్ట్రంలోని  900 నుండి 1000 కుటుంబాలు కలిగిన టూంజాయ్ గ్రామం స్వయంగా  క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసుకున్నారు..ఆ గ్రామంలో నివసించే పౌముయ్ తెగకు చెందిన  ప్రజలకు క్రమశిక్షణ, కష్టించే పనిచేసే తత్వం ఎక్కువ అందుకే ప్రభుత్వ సేవల కోసం ఎదురు చూడకుండా వివిధ ప్రాంతాలకు ఉపాది కోసం వెళ్లి, లాక్ డౌన్ వేళ సొంత ఊరికి రావాలనుకుంటున్న తమ వారకోసం  ఎలాంటి ఇబ్బంది రాకుండా 80 క్వారంటైన్ కేంద్రాలను రెడీ చేశారు. వీటిల్లో క్వారంటైన్ లో ఉండాల్సిన వారికి ఏఏ సదుపాయాలుండాలో అన్ని సదుపాయాలను కల్పించారు.

గ్రామ శివారులో 80 గుడిసెలను నిర్మించారు. వీటిల్లో ఒక్కో దాంట్లో  ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా వాటర్ ఫెసిలిటి కూడా కల్పించారు..టుంజాయ్ గ్రామస్తుల పని తీరుపై స్వయంగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పందించారు..ఆ గ్రామ ప్రజలను మెచ్చుకుంటూ బీరేన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

“టుంజాయ్ గ్రామ పంచాయితీకి నా సెల్యూట్. రాష్ట్రం బైట నుంచి రాబోతున్న తమ గ్రామస్తులకు క్వారంటైన్ సదుపాయం కోసం వీరంతా కలిసి ప్రత్యేకంగా 80 గుడిసెలు నిర్మించారు. ప్రతి గుడిసెలోనూ ఓ మంచం, ప్రత్యేక టాయిలెట్, గ్యాస్ టేబుల్, విద్యుత్ సదుపాయం, చార్జింగ్ సాకెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నీటి సరఫరా కూడా ఏర్పాటు చేశారు…’’ అనేది సిఎం బీరేన్ సింగ్ ట్వీట్ సారాంశం.లాక్‌డౌన్‌తో తమ రాష్ట్రానికి చెందిన దాదాపు 40 వేల మంది ప్రజలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నారని, వారిలో చాలామంది వెనక్కి రావాలనుకుంటున్నారని, ఆప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు బీరేన్ సింగ్.

ఎవరో రావాలి , ఏదో చేయాలి అని ఎదురు చూడకుండా తమకు తోచినంతలో ఏర్పాట్లు చేసుకుని,లాక్  డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా, సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ రోజు వారి పనులకు ఆటంకం కలగకుండా సాగిపోతున్న టుంజాయ్ గ్రామ వాసులు దేశంలోని అన్ని గ్రామాలకే కాదు, ప్రపంచానికే ఆదర్శం.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనాతో సహజీవనం చేస్తూనే మనల్ని మనం కాపాడుకోవచ్చు.


End of Article

You may also like