Ads
కరోనా వచ్చిందా లేదా అన్న టెన్షన్ కంటే.. కరోనా టెస్ట్ చేయించుకోవడమే ఎక్కువ టెన్షన్ ని కలిగిస్తోంది. లాంగ్ క్యూలలో నుంచోవాల్సి రావడం, రిపోర్ట్ ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడం వంటి పరిస్థితులతో చాలా మంది కరోనా టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమం లో సెల్ఫ్ కరోనా టెస్టింగ్ కిట్ ను పూణే కు చెందిన కంపెనీ రూపొందించింది. తాజాగా.. వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఆమోదించింది.
Video Advertisement
ఈ కంపెనీ రూపొందించిన కిట్స్ తో ఎవరికీ వారే కరోనా టెస్ట్ లను చేసుకోవచ్చు. ఈ కిట్ ఖరీదు కేవలం 250 రూపాయలు మాత్రమే. కేవలం రెండు నిమిషాల్లో టెస్ట్ పూర్తి అవుతుంది.. 15 నిమిషాల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వారు ఈ ప్రోడక్ట్ ను డెవలప్ చేసారు. వచ్చే వారం నుంచి ఇవి మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ కిట్ ఉపయోగించుకున్నాక సేఫ్ గా పడేయడానికి ఓ డిస్పోజల్ బాగ్ ను కూడా వీరు అందిస్తున్నారు. టెస్ట్ చేసుకున్నాక ఒక ఫోటో తీసుకుని సేవ్ చేసుకోవాలి. ఒకవేళ లక్షణాలు కనిపిస్తూ.. ఈ టెస్ట్ లో నెగటివ్ చూపిస్తే.. వారు కచ్చితం గా RT PCR పరీక్ష చేయించుకోవాలి.
End of Article