Ads
చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి వ్యవహారం గురించి సోషల్ మీడియాలో గతకొంత కాలంగా వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ కానీ కళ్యాణ్ దేవ్ కానీ స్పందించకపోవడంతో ఈ వార్త నిజమే అనుకుంటున్నారు చాలా మంది. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి పూజిత ఒక ఇంటర్వ్యూలో శ్రీజ మూడో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి ఇండస్ట్రీలో పేరు మర్యాదలు ఉన్న స్టార్ హీరో.
Video Advertisement
ఈ విధంగా ఆయన కూతురు వివాహం విషయంలో స్థిరమైన మైండ్ తో ఉండకపోవడం కరెక్ట్ కాదని పూజిత అన్నారు. ఒకవేళ శ్రీజ మూడవ వివాహం చేసుకుంటే చిరంజీవి పరువు పోతుందని ఆమె సంచలన కామెంట్స్ చేసారు. శ్రీజ పద్ధతి ఏ మాత్రం బాగా లేదని, సర్దుకుపోతే సంసారంలో ముందుకు పోవచ్చని అన్నారు పూజిత.
శ్రీజకు వారింట్లో ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఈ విధంగా చేయడానికి కారణం కావచ్చు అని అన్నారు. శ్రీజ మూడో పెళ్లికి వెళ్లకుండా ఉండటమే మంచిదని, ఇలా ఉంటే చిరంజీవి గౌరవం కాపాడిన కూతురు అవుతుందని సలహా ఇచ్చారు. నిజానికి వాళ్ల కుటుంబ విషయాలు పెద్దగ తెలియని నేను ఇంత వరకు మాత్రమే మాట్లాడాగలనని చెప్పుకొచ్చింది పూజిత. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని, ఒక బిడ్డ పుట్టాక విడాకులు తీసుకుంది. తర్వాత వారి సమీప బంధువైన కళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది.
మొదట శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా నుండి కళ్యాణ్ దేవ్ ఫోటో ను తొలగించడంతో, వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని రూమర్స్ కు బలం చేకూరింది. శ్రీజతో విడాకులు తీసుకుంటారు అనే విషయం బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా విడుదలయ్యాయి. చివరకు ఈ విషయం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.
watch video :
https://youtu.be/vPC-QrrIvh4
End of Article