సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటి కవిత…వీపులు గోకేది వాళ్లే అంట.!

సంచలన కామెంట్స్ చేసిన సీనియర్ నటి కవిత…వీపులు గోకేది వాళ్లే అంట.!

by Anudeep

Ads

సినిమా పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. వాటిల్లో క్యారవాన్ సంస్కృతి ఒకటి. గతంలో క్యారవాన్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు సినిమా హీరోహీరోయిన్లతో పాటు నటినటులందరికి క్యారవాన్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఇది నిర్మాతకు అదనపు భారం అని  నటుడు చిరంజీవి ఈ మద్య కామెంట్ చేసిన విషయమే విధితమే. చిరంజీవి కామెంట్స్ పై స్పందనగా సీనియర్ నటి కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు .

Video Advertisement

“క్యారవాన్ల వల్ల షూటింగ్ దినాలు పెరిగిపోయాయి . వీటికోసం నిర్మాతలు కోట్లల్లో ఖర్చుపెడుతున్నారు.నటీనటులు ఈ పద్ధతి మార్చుకోవాలని , తాను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని, అంతేకానీ సీన్ అయిపోగానే అందులోకి వెళ్లిపోవడంలాంటివి చేయను” అని చిరంజీవి కామెంట్స్ చేశారు .”చిరంజీవిగారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం” అని నటి కవిత సీరియస్ గా స్పందించారు .

” ఒకప్పుడు మాకు క్యారవ్యాన్లు ఉండేవి కావు. చెట్ల కింద మేకప్ వేసుకునేవాళ్లం, అక్కడే తినేవాళ్లం. ఇంకా చెప్పాలంటే చెట్ల వెనకాలే దుస్తులు కూడా మార్చుకునేవాళ్లం. అందరం ఒకే దగ్గర కూర్చుని తర్వాతి సన్నివేశం ఏంటి అని డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు అలా కాదు ప్రతీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి వారి క్యారవ్యాన్లలో కూర్చుని స్క్రిప్ట్ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారు. అని కామెంట్ చేసారు .

ఇదే సంధర్బంలో  కవిత తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు . అదేంటంటే  “ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను దుస్తులు మార్చుకుని రావాలని చెప్పారు. అప్పుడు నేను హీరోయిన్ క్యారవ్యాన్‌లోకి వెళ్లి మార్చుకోవాలని అనుకున్నా. కానీ ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు. ఇది నా క్యారవ్యాన్. మీరు లోపలికి ఎలా వెళ్తారు అంది.  పక్కనే ఉన్న నిర్మాత , ఆమెను తిట్టాల్సిందిపోయి చూస్తూ నిలబడిపోయాడు.  నిర్మాతలే హీరోయీన్ల వీపులు గోకేస్తున్నారు. అలాంటప్పుడు చిరంజీవి లాంటి వాళ్లు ఎంత మాట్లాడి ఏం లాభం అని తనకు ఎదురైన సంఘటనని గుర్తు చేసుకున్నారు కవిత. ఒకప్పుడు నటీనటులందరం ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లం , నేటి తరం నటీనటులకు అలాంటి విలువలేం లేవు అని మండిపడ్డారు .

అంతేకాదు తెలుగు సినిమాల్లో అవకాశాలపై స్పందిస్తూ “నాకు తెలుగులో అవకాశాలు రావడంలేదు. నేను వరుసగా తమిళ సినిమాలు చేస్తున్నాను. తెలుగువాళ్లు తెలుగువాళ్లకి అవకాశం ఇవ్వరు. కానీ తమిళంలో అలా కాదు. వాళ్లు ముందు తమిళ నటీనటులకే అవకాశం ఇస్తారు. ఒకవేళ డేట్లు కుదరకపోతే తెలుగువారిని తీసుకుంటారు. తెలుగు వాళ్లకి పక్కింటి పుల్ల కూరే ఇష్టం” అని ఘాటుగా స్పందించారు.


End of Article

You may also like