సీనియర్ ఎన్టీఆర్ గారి చేతిరాత ఎప్పుడైనా చూశారా ? ముత్యాల్లాంటి రాత…అచ్చం ప్రింట్ లాగే.!

సీనియర్ ఎన్టీఆర్ గారి చేతిరాత ఎప్పుడైనా చూశారా ? ముత్యాల్లాంటి రాత…అచ్చం ప్రింట్ లాగే.!

by Mohana Priya

Ads

సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Video Advertisement

ఇది ఇలా ఉండగా…ఎన్టీఆర్ కు తెలుగు భాష పై మంచి పట్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన చదువులోనూ ముందుండేవారు. 1100 మంది రాసిన మద్రాసు సర్వీసు కమిషన్ ప‌రీక్ష‌లో 7వ ర్యాంక్ సాధించి మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగాన్ని పొందారు అన్న గారు. అంతేకాదు చిత్ర‌లేఖనంలో కూడా రాష్ట్ర స్థాయి ప్రైజులు సాధించారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేతిరాత వైర‌ల్ అవుతుంది.

ముత్యాలు లాంటి అక్షరాలు, ఎక్కడ తప్పులు లేని వాక్యాలు, ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు, వివరణలు. విజ‌య‌చిత్ర అనే ప‌త్రిక ద్వారా పాఠ‌కుల‌కు ఆయ‌న రాసిన లేఖ ఇది. మూడు పేజీల లేఖ షూటింగ్ మ‌ద్య‌లో విరామంలో రాసిన‌ది కావ‌డం విశేషం. ఆ లేఖ కింద చిత్రాల్లో మీరే చూడండి.

ఈ లేఖలో ఎన్టీఆర్ గారు తన సినిమాల గురించి, ప్రేక్షకుల గురించి, అలాగే తనకి సినిమా ఇండస్ట్రీలో లభించిన ఆదరణ గురించి, అవకాశం ఇచ్చిన నిర్మాతల గురించి రాశారు. అలాగే ప్రేక్షకులందరికీ కూడా తనని ఎంతో ఆదరించినందుకు, తన సినిమాలని హిట్ చేసినందుకు థాంక్స్ చెప్పారు. ఇంకా చాలా విషయాల గురించి ఎన్టీఆర్ గారు ఈ లెటర్ లో రాశారు.

అలాగే సినిమాలకి వారు పడే కష్టం గురించి కూడా ఎన్టీఆర్ రాశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వ కారణం అయిన నటులలో ఎన్టీఆర్ గారు మొదటి స్థానంలో ఉంటారు. ఈ లెటర్ చూస్తే ఆయన అప్పట్లో తన గురించి మాత్రమే కాకుండా, తనతో పని చేసిన వారి గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత ఆలోచించే వారు అనేది తెలుస్తోంది. అలాగే ప్రజల గురించి కూడా ఆలోచించి ఎన్టీఆర్ గారు ఆ సమయంలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు. అందుకే సినిమాల్లో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎన్టీఆర్ హీరో అయ్యారు.

 


End of Article

You may also like