Ads
తెలుగువారికి సంక్రాంతి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. అయితే సినిమా వాళ్ళకి కూడా సంక్రాంతి అంతే పెద్ద పండుగ. ఎందుకంటే వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి అదే మంచి అవకాశం. సంవత్సరం అంతా కష్టపడి పనిచేసిన ప్రజలు పండగలో సొంత ఊర్లకు వచ్చి రిలాక్స్ అయ్యే టైం అది. వాళ్ళ రిలాక్సేషన్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సినిమాకే ఉంటుంది.
Video Advertisement
అందుకే సినిమా వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనైనా పండగకి సినిమా రిలీజ్ చేయాలని చూస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. 36 సంవత్సరాల తన సినీ జీవితంలో 32 సంక్రాంతిలకి తన సినిమాని విడుదల చేసిన ఘనత మన సీనియర్ ఎన్టీఆర్ ది.
అయితే 1977లో రిలీజ్ అయిన దానవీరశూరకర్ణ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. సినిమా 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది ఈ సినిమాను ఎన్టీఆర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై సొంతంగా నిర్మించారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించటంతో పాటు దుర్యోధనుడిగా, కర్ణుడిగా, కృష్ణుడిగా 3 విభిన్న పాత్రలలో నటించారు.
ఎన్టీఆర్ తనయులు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ఈ సినిమాలో నటించారు. మామూలుగానే సినిమాలో ఒక రాముడు పాత్ర, లేదంటే ఒక కృష్ణుడి పాత్ర వేస్తేనే జనాలు తెరలకు అతుక్కుపోయేవారు ఆ రోజులలో అలాంటిదే మూడు పాత్రలు ఒకే సినిమాలో వేస్తే ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు జనాలు. 20 లక్షలు తో ఈ సినిమాను తీసి మూడుసార్లు రిలీజ్ చేశారు. 20 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 15 రెట్లు ఎక్కువగా లాభాలను తీసుకువచ్చింది. అప్పట్లోనే ఈ సినిమా 3 కోట్లు వసూలు చేసింది.
అప్పట్లోనే మూడు కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఈ సినిమా నిడివి కూడా నాలుగు గంటలకు పైగా ఉంటుంది. 25 రీల్స్ తో భారతదేశంలోనే అతిపెద్ద సినిమాగా రికార్డులకు ఎక్కింది ఈ సినిమా. 9 కేంద్రాలలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ సినిమాకి ఉన్న మరొక రికార్డు ఏమిటంటే రెండోసారి సినిమాని రిలీజ్ చేసినప్పుడు కూడా 100 రోజులు ఆడింది. ఈ రికార్డు మరే సినిమాకి లేకపోవడం గమనార్హం.
End of Article