Ads
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్ డౌన్ మొదట్లో పోలీసులు అంత గా పట్టించుకోకపోవడం తో జనాలు తిరుగుతూనే ఉన్నారు. అయితే.. కేసులు మరింత గా పెరుగుతున్న నేపధ్యం లో పోలీసులు కూడా నిబంధనలను కఠినతరం చేసారు. ప్రజలను బయటకు రావద్దంటూ హితవు చెప్తూనే.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినం గా వ్యవరిస్తున్నారు.
Video Advertisement
ఈ క్రమం లో సీనియర్ ఆఫీసర్ సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్ ఓ సాధారణ పౌరుడి గా మారు వేషం వేసుకుని క్షేత్ర స్థాయి లో లాక్ డౌన్ ఎలా అమలు అవుతోందో తెలుసుకోవడానికి బండి పై ఊరంతా తిరిగారు. పలు చోట్ల డ్యూటీ లో ఉన్న పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో రీసన్ చెప్తూ ముందుకెళ్ళిపోయారు. మందులు కోసం వెళ్తున్నానని.. తమ ఇంట్లో వారికి జ్వరం ఉందని.. ఇలా రకరకాల కారణాలు చెప్తూ వెళ్లారు. ఓ చోట మాత్రం కొందరు పోలీసులు వెళ్లనివ్వలేదు.
మందులు కావాలంటే పోలీసులే తెచ్చి ఇస్తారని, బయటకు రావద్దని.. ఆయన వద్ద నున్న బండి ని తీసేసుకున్నారు. ఆ తరువాత ఆయన తలకు చుట్టుకున్న ముసుగు తీసేసరికి అందరు షాక్ అయ్యారు. క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ ఎలా అమలవుతోందో తెలుసుకునేందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు.
End of Article