Home Bigg Boss 7 telugu బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 లో మరొక సీరియల్ సెలబ్రిటీ ఎంట్రీ..! ఎవరంటే..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 లో మరొక సీరియల్ సెలబ్రిటీ ఎంట్రీ..! ఎవరంటే..?

by Anudeep

ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత ఫేమస్ ఓ… కొన్ని రియాలిటీ షోలు కూడా అంతే ఫేమస్ అంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. నిజమే బిగ్ బాస్ రియాలిటీ షో అంటే చాలు పిల్లా పెద్దా అంతా కలిసి టీవీల ముందు ఓటీటీల ముందు అతుక్కు పోతారు.

ఇదిలా ఉంటే కొందరు సినిమాలను బాగా ఇష్టపడతారు. అదే సీరియల్ అంటే ఇష్టపడని ఇల్లాలు ఉండదు. రోజుకో సస్పెన్స్ తో అందరినీ ఆకర్షించే సీరియల్స్ పైనా, అందులో నటులపైన ఎంతో అభిమానం పెంచుకుంటారు. అలా ఫేమస్ అయిన సీరియల్ కార్తీక దీపం.

అందులో నటులు కూడా అంతే ఫేమస్ అయ్యారు.ఎంతలా అంటే ఎంట్రన్స్ పరీక్షల్లో కార్తీక దీపం సీరియల్ ఇందులో వస్తుంది అనే అంత ఫేమస్.ఇంక డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఎటు చూసినా వీళ్ళ గురించే టిక్ టాకులు, మీములు చేసేవాళ్ళు. అంత ఫేమస్ అయినా ఈ నటులు… బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో పాల్గొంటే ఎలా ఉంటుందో!

అయితే కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన మొనిత అలియాస్ శోభా శెట్టి బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. నిజానికి బిగ్ బాస్ సీజన్ 6 లోనే శోభా ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారాలు జరిగాయి కానీ వీలు కాలేదు.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో కచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట.

Reason behind Shobha Shetty not appearing in Karthika deepam serial

తన అందంతో, నటనతో అందరి అభిమానాన్ని సొంత చేసుకున్న మొనిత బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదు. సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా తనకే సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓట్ బ్యాంక్ కూడా తనవైపే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి తన ఆట తీరుతో శోభ శెట్టి అలియాస్ మోనిత బిగ్ బాస్ హౌజ్ లో ఎలా అలరిస్తుందో… ఎన్ని వోట్లు దక్కించుకుంటుందో చూడాలి.

ALSO READ : బేబీ సినిమాలో “విరాజ్ అశ్విన్” పాత్ర కోసం… ముందుగా అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా..?

You may also like