Ads
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాకేష్ మాస్టర్ ఎన్నో సినిమాల్లో ఎన్నో హిట్ పాటలకి కొరియోగ్రఫీ చేశారు. రాకేష్ మాస్టర్ దగ్గర పనిచేసిన వారిలో ఇప్పుడు ఉన్న ఎంతో మంది ఫేమస్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు.
Video Advertisement
శేఖర్ మాస్టర్ లాంటివారు రాకేష్ మాస్టర్ తో కలిసి అంతకుముందు పని చేశారు. రాకేష్ మాస్టర్ ఈటీవీలో వచ్చిన ఢీ షో ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువ అయ్యారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు రాకేష్ మాస్టర్ ఎక్కడా కనిపించలేదు. సడన్ గా కొంత కాలం క్రితం సోషల్ మీడియా ద్వారా రాకేష్ మాస్టర్ మళ్ళీ ఫేమస్ అయ్యారు.
ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి తన అభిప్రాయాలని తెలిపారు. తాను సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనేది కూడా రాకేష్ మాస్టర్ చెప్పారు. అయితే రాకేష్ మాస్టర్ చనిపోయినట్టు తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్న రాకేష్ మాస్టర్ సడన్ గా మన మధ్య లేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
రాకేష్ మాస్టర్ అంత్యక్రియల సమయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ తో పాటు రాకేష్ మాస్టర్ శిష్యులు ఎంతో మంది వెళ్లి చివరి చూపు చూశారు. అయితే రాకేష్ మాస్టర్ మృతి పైన చంద్రశేఖర్ అనే ఒక సీనియర్ సీరియల్ నటుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రూపొందించిన పోపుల పెట్టే అనే సీరియల్ ద్వారా చంద్రశేఖర్ పరిచయం అయ్యి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించారు.
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, మరొకవైపు సినిమాల్లో సీరియల్స్ లో నటించారు. అయితే చంద్రశేఖర్ ఇప్పుడు రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడారు. రాకేష్ మాస్టర్ మృతి పై చంద్రశేఖర్ మాట్లాడుతూ, “వ్యసనాలు మనిషిని పతనం చేస్తాయి” అని చెప్పారు. “అందుకే యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి” అని అన్నారు. అంతే కాకుండా, “ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఇలాంటి ఆకర్షణలు చాలా ఎక్కువగా ఉంటాయి” అని, “కొత్తగా వచ్చిన నటీనటులు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి” అని చంద్రశేఖర్ అన్నారు.
End of Article