మామూలుగా ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేస్తూ ఉంటే ముందు స్నేహితులు అవ్వడం తర్వాత వారి అభిప్రాయాలు కలిసి ప్రేమికులు అవ్వడం తర్వాత పెళ్లి చేసుకోవడం సహజమే. ఇది అన్ని రంగాల్లో జరిగే విషయమే. కానీ సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది కాబట్టి వాళ్లు ఎవరినైనా ప్రేమిస్తే అందరికీ తెలిసిపోతుంది.

Video Advertisement

ఇంక వాళ్ళు పెళ్లి చేసుకుంటే మామూలు వ్యక్తులే కాకుండా మీడియా కూడా అంతే ఆసక్తిగా సెలబ్రిటీల పెళ్లిళ్లలో జరిగే ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సీరియల్స్ లో నటించే నటులని దాదాపు ప్రతి కుటుంబం తమ ఇంట్లో వారిగా అనుకుంటారు. కాకపోతే వాళ్ళలో కూడా ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అని ఆ సెలబ్రిటీలు చెప్పేంతవరకు ఎక్కువ మందికి తెలియదు.

ఇక అసలు విషయానికి వస్తే…జానకి కలగనలేదు సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి… కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్స్ ఫేమ్ తేజస్విని గౌడ ల నిశ్చితార్తం తాజాగా జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు పలుగురు బుల్లితెర సెలెబ్రెటీలు హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు.

నెటిజెన్స్ కూడా ఈ పోస్ట్స్ లైక్స్ చేస్తున్నారు. ఇంతకాలం అసలు వీరు లవ్ లో ఉన్నదే తెలీదు…సీక్రెట్ గా మైంటైన్ చేసారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ “అరియనా” ఈ జంటకి కంగ్రాట్స్ చెప్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.