Ads
ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ నటి శరణ్య. తెలుగు లోనే కాదు.. మలయాళం లోను, తమిళ్ లోను ఆమె పలు సీరియల్స్ లో నటించింది. మలయాళం సీరియల్ లో తన నటనకు గాను ఆమె అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం ఈమె చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది.
Video Advertisement
నటిగా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చింది. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఇప్పటికే ఆమెకు 11 సార్లు సర్జరీలు జరిగాయి. ఆమెకు వెన్నెముక నుంచి ఆ వ్యాధి మిగిలిన అవయవాలకు కూడా వ్యాపిస్తోంది వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోందనుకుంటున్న తరుణం లో ఆమె సోదరుడికి, తల్లికి కరోనా పాజిటివ్ రావడం తో ఆమెను చూసుకునేవారు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆమె గురించిన విషయాలను మరో నటి సీమా నాయర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు.
End of Article