Ads
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇంట్లో నుండే చూసేస్తున్నారు. ఓటీటీ కల్చర్ పెరిగినప్పటి నుండి ముఖ్యంగా వెబ్ సిరీస్ లకు సినీ ప్రియులు బాగా అలవాటు పడిపోయారు. ప్రతి వారం వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
Video Advertisement
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో తాజాగా డిఫరెంట్ స్టోరీ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘స్వీట్ కారం కాఫీ’. మూడు తరాలకు చెందిన మహిళల కథగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మహిళల స్టోరీనే ఈ వెబ్ సిరీస్. కుటుంబంలోని ఆడవాళ్ళకి ఏం కావాలో తెలియని సగటు మనిషి రాజరత్నం. అతను ఇంట్లోని వారు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అతని తల్లి సుందరి (లక్ష్మి), భార్య కావేరి (మధు), కుమార్తె నివి (శాంతి) సంతోషంగా ఉన్నారని భావిస్తాడు. తల్లిని ఇంట్లోనే ఉంచి చిన్న పిల్లలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆమెకు ఎక్కడికైనా వెళ్లి గడపాలని కోరుకుంటుంది.
కుమార్తె క్రికెటర్ గా తన కెరీర్ ను, తనను గౌరవించే వ్యక్తి కోసం వెతుకుతుంటుంది. ఇక గృహిణి అయిన కావేరికి ఇళ్లే ప్రపంచం. కానీ భర్త, కొడుకు సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోతుంది. అలా ఈ మహిళలు ముగ్గురు ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు. వారు తమ జర్నీని ఎలా కొనసాగించారు? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. నిజ జీవితంలో ప్రతిరోజూ తమ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే ప్రతి మహిళ జీవితం గురించి ఈ సిరీస్ లో ప్రస్తావించారు. ముగ్గురు మహిళల పాత్రలను చక్కగా రాసుకున్నారు. వారి పాత్రలలో మనల్ని మనం ఊహించుకునేలా ఉన్నాయి. లక్ష్మి, మధుబాల ఇద్దరూ తమ పాత్రలలో జీవించారు. 7వ ఎపిసోడ్‌లో లక్ష్మి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శాంతి చక్కగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
End of Article