టాటూ సీక్రెట్ బయటపెట్టిన జెర్సీ హీరోయిన్… ఆ అబ్బాయి కోసమే అంట…!

టాటూ సీక్రెట్ బయటపెట్టిన జెర్సీ హీరోయిన్… ఆ అబ్బాయి కోసమే అంట…!

by Mounika Singaluri

Ads

చాలామంది ఒంటిమీద పచ్చబొట్లు వేయించుకుంటూ ఉంటారు… దాన్ని స్టైలిష్ గా టాటూస్ అంటూ పిలుస్తారు. టాటూ వేయించుకునే ప్రతి ఒక్కరి వెనకాల ఒక రీజన్ ఉంటుంది. కొందరు తమకి ఇష్టమైన వారి పేర్లను టాటూ పెంచుకుంటూ ఉంటారు, మరికొందరు తమకిష్టమైన వారి జ్ఞాపకాలను టాటూగా వేయించుకుంటూ ఉంటారు. అయితే టాటూ అసలు ఎందుకే ఎంచుకున్నారు ఎవరికోసం వేయించుకున్నారు అనేది వారు బయట పెడితే తప్ప చెప్పలేము…!

Video Advertisement

అయితే ఇప్పుడు జెర్సీ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ తన ఎదపై ఉన్న టాటూ గురించి వివరణ ఇచ్చింది. శ్రద్ధ స్వతహాగా కనడ అమ్మాయి 2015లో మలయాళీ సినిమాతో కెరీర్ ఆరంభించి అనంతరం తెలుగు తమిళ సినిమాల్లో బిజీ అయింది.

హిందీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి తన టాలెంట్ ని చూపించింది.తెలుగులో జెర్సీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత వరుస పెట్టి సినిమాల చేయడం మొదలుపెట్టింది. తాత వెంకటేశ్ సరసన సైంధవ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా విషయాలు శ్రద్ధ పంచుకుంది.అందులో భాగంగానే తన ఎదపై ఉన్న టాటూ గురించి చెప్పుకొచ్చింది తనకి 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిందట. అతని ద్వారానే తనకి బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందట. తనకి ఇష్టమైన ఆ అబ్బాయికి గుర్తుగా లవ్ అని అర్థం వచ్చేలా ఆ టాటూ ని వేయించుకున్నట్లు చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు.


End of Article

You may also like