Ads
ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో హిట్ కొట్టారు షారుఖ్ ఖాన్. మళ్లీ కొంచెం గ్యాప్ తర్వాత డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : డంకీ
- నటీనటులు : షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్.
- నిర్మాత : జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్
- దర్శకత్వం : రాజ్‌కుమార్ హిరానీ
- సంగీతం : ప్రీతమ్
- విడుదల తేదీ : డిసెంబర్ 21, 2023
స్టోరీ :
సినిమా 1995 ప్రాంతంలో జరుగుతుంది. పంజాబ్ లో ఉండే లల్టు అనే ఒక ఊరికి హర్దయాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హార్డీ (షారుఖ్ ఖాన్) వస్తాడు. హార్డీ ఒక సోల్జర్. ఆ ఊరిలో ఉండే బార్బర్ అయిన బల్లి (అనిల్ గ్రోవర్), బట్టల షాప్ లో పని చేసే బుగ్గు లఖన్ పాల్ (విక్రమ్ కొచ్చార్), సుఖీ (విక్కీ కౌశల్), మను (తాప్సీ పన్ను) వీళ్ళందరికీ ఇంగ్లాండ్ వెళ్ళాలి అని ఉంటుంది. కానీ వారు ఉన్న పరిస్థితికి ఇంగ్లాండ్ వెళ్లడం అనేది చాలా పెద్ద విషయం.
అంతే కాకుండా వారి దగ్గర ఇంగ్లాండ్ వెళ్ళడానికి వీసా లాంటివి కూడా ఉండవు. కొన్ని కారణాల వల్ల సుఖీ వీరికి దూరం అవుతాడు. దాంతో మిగిలిన వాళ్ళు అందరూ ఇంగ్లాండ్ వెళ్లాలి అని నిర్ణయించుకుంటారు. వీరందరికీ హార్డీ దారి చూపిస్తాడు. అందరూ ఇంగ్లాండ్ కి ఎలా వెళ్లారు? వెళ్లే సమయంలో వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు సుఖీ ఎందుకు దూరం అయ్యాడు? చివరికి ఇంగ్లాండ్ వెళ్ళారా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అప్పటి నుండి సినిమా మీద ఆసక్తి నెలకొంది. కానీ గత రెండు నెలలుగా సినిమా మీద ఆసక్తి ఇంకా పెరిగింది. అందుకు కారణం ఈ సినిమా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకి పోటీగా విడుదల అవుతోంది. కానీ అసలు ముందు రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా ఇదే. అయినా కూడా ఈ సినిమా మీద ట్రోలింగ్ జరిగింది. “మీ సినిమా మా ముందు నిలబడదు” అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ట్రైలర్ చూసిన తర్వాత కూడా సినిమా మీద ఆసక్తి పెరగడం కంటే తగ్గింది. ఎందుకంటే ట్రైలర్ చాలా సాధారణంగా అనిపించింది. కానీ సినిమా మాత్రం అలా లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాకి ట్రైలర్ న్యాయం చేయలేదు ఏమో అనిపిస్తుంది. సినిమా సాధారణంగానే స్టార్ట్ అవుతుంది. సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోలాగా కనిపించరు. సినిమా మొత్తం పాత్రల మీద ఉంటుంది కాబట్టి ఎలివేషన్స్ కూడా పెద్దగా ఉండవు. షారుఖ్ ఖాన్ ఎంట్రీకి విజిల్స్ వేసే అంత గొప్పగా ఏమీ ఉండదు.
సినిమా మొత్తం హార్డీ పాత్ర మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. మొదట్లో అంతా చాలా మామూలుగా నడిచిన సినిమా, ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ఎమోషన్స్ తో సాగుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఏ ఒక్క హీరో, లేదా స్టార్ కనిపించరు. కేవలం నటులు మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్క నటుడు, నటి తమ పాత్రలకి న్యాయం చేశారు.
హార్డీ పాత్రలో షారుఖ్ ఖాన్ చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఏడిపించారు కూడా. సూఖీ పాత్రలో విక్కీ కౌశల్ కనిపించేది కొంచెం సేపే అయినా కూడా గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. బోమన్ ఇరానీ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. తాప్సీ కూడా పర్వాలేదు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. సాధారణంగా డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ గతంలో దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే అన్నీ కూడా స్టార్ హీరోలు అనే ఆలోచన లేకుండా కేవలం పాత్రల మీద నడుస్తాయి.
ఈ సినిమా కూడా అలాగే ఉంది. ఈ సినిమాతో రాజ్‌కుమార్ హిరానీ కొత్తగా ఏమీ చూపించాలి అని ప్రయత్నం చేయలేదు. తన స్టైల్ లోనే, తాను ఎమోషన్స్ ప్రజెంట్ చేసే విధానంలోనే ఈ సినిమాని నడిపించారు. కానీ ఆయన సినిమాలో షారుఖ్ ఖాన్ నటించడం అనేది కొత్తగానే అనిపిస్తుంది. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ నటించిన గత రెండు సినిమాలు కూడా యాక్షన్ సినిమాలు. ఈ సినిమా అలాంటిది కాదు.
సమాజంలో జరిగే కొన్ని విషయాల మీద కూడా ఈ సినిమా ఫోకస్ చేసింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మాత్రం కథలోకి వెళ్లడానికి కాస్త టైం పడుతుంది. ఈ టైంలో పాత్రలని పరిచయం చేస్తారు. వారి పాత్రలు ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఇందులో చూపిస్తారు. కానీ అక్కడ కాస్త టైం ఎక్కువగా అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- ఎమోషనల్ సీన్స్
- సహజంగా అనిపించిన కామెడీ
- పాటలు
మైనస్ పాయింట్స్:
- పాత్రల డెవలప్మెంట్ కి తీసుకున్న టైం
- ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ అయినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్ :
3.5/5
ట్యాగ్ లైన్ :
డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ సినిమాలని ఇష్టపడే వారికి, ఎమోషనల్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. షారుఖ్ ఖాన్ ఈ సినిమా మీద ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారో అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ ఎమోషనల్ సినిమాల్లో మొదటి వరుసలో ఉండే సినిమాగా డంకీ సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఈ యాడ్ లో ఉన్న “రవితేజ” హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
End of Article