Ads
ఎన్నో డబ్బింగ్ సినిమాలకు తెలుగులో దాదాపు తెలుగు సినిమాలతో సమానంగా ప్రేక్షకాదరణ లభించింది. అందులో ఒక సినిమా సఖి. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో ఉన్న బెస్ట్ లవ్ స్టోరీస్ లిస్ట్ లో సఖి సినిమా కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాకి మణిరత్నం గారి దర్శకత్వం, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఒక ప్లస్ పాయింట్ అయితే, మరొక ప్లస్ పాయింట్ హీరో, హీరోయిన్ల పర్ఫామెన్స్.
Video Advertisement
హీరోయిన్ షాలినికి అయితే సఖి సినిమాతో ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సఖి సినిమాలో తన నటనకి స్పెషల్ ప్రైజ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ జాబితాలో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ కూడా అందుకున్నారు షాలిని. 2000 సంవత్సరంలో తమిళ్ స్టార్ హీరో అజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
2001 లో వచ్చిన ప్రియద వరమ్ వేండుమ్ అనే సినిమాలో చివరిగా నటించారు షాలిని. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత షాలిని మళ్ళీ కం బ్యాక్ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మణి రత్నం గారి దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ అనే పాన్ ఇండియన్ సినిమా రూపొదుతోంది. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, విక్రమ్, కార్తి, శరత్ కుమార్, పార్తిబన్, శోభితా ధూళిపాళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో షాలిని కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం షాలిని కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది తెలుగు, తమిళ అభిమానులకి ఇది శుభవార్త అవుతుంది.
ఇంక పొన్నియన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే ఐశ్వర్యరాయ్, శరత్ కుమార్, త్రిష, కార్తి, పార్తిబన్ పై ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో రాజుల కాలం లాగా ఉండే ఒక సెట్ ని రూపొందించారు. విక్రమ్ కూడా ఇటీవల షూట్ లో జాయిన్ అయ్యారు.
End of Article