“శంకర్ దాదా MBBS ” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.? అతను ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.!

“శంకర్ దాదా MBBS ” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.? అతను ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.!

by Mohana Priya

Ads

కొన్ని సార్లు డైరెక్ట్ సినిమా కంటే రీమేక్ సినిమాలపై ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, సాధారణంగా ఒక హిట్ అయిన సినిమాని మాత్రమే రీమేక్ చేస్తారు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఆ సినిమాని, ఆ ఒక్క ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాకుండా, వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తారు. దీనికి ఉదాహరణ అర్జున్ రెడ్డి, 96. ఇందులో అర్జున్ రెడ్డి మన తెలుగు సినిమా. కానీ ఈ సినిమా క్రేజ్ వేరే రాష్ట్రాలకు కూడా పాకింది. అలాగే తమిళ్ సినిమా అయిన 96 కూడా మనలో చాలా మంది చూసే ఉంటాం.

Video Advertisement

ఈ రెండు మాత్రమే కాదు ఇలా చాలా సినిమాలు ఉంటాయి. అందుకే కొన్ని కొన్ని సార్లు రీమేక్ చేయడం చాలా కష్టం. ఒరిజినల్ సినిమా ఫ్లేవర్ ఏమాత్రం పాడవకుండా రీమేక్ చేయాలి. అంతే కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే ఆ సినిమా ఒక సక్సెస్ ఫుల్ రీమేక్ అవుతుంది. ఈ సక్సెస్ ఫుల్ రీమేక్ కేటగిరీకి చెందిన సినిమా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.

ఈ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒరిజినల్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా, అలాగే మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఒక యాక్సిడెంట్ లో తన తల్లిదండ్రుల్ని కోల్పోయి, తర్వాత కోమాలోకి వెళ్లిన శ్రీరామ్ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత శ్రీరామ్ కోలుకొని మామూలు మనిషి అవుతాడు.

 

శ్రీరామ్ పాత్ర పోషించిన వ్యక్తి మనందరికీ తెలుసు. అతను ఇప్పుడు హీరోగా కూడా పరిచయం అవ్వబోతున్నారు. శ్రీరామ్ పాత్ర పోషించింది వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు వైష్ణవ్ తేజ్.

లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయింది. కాబట్టి సినిమా విడుదల గురించి అధికారికంగా ఎనౌన్స్మెంట్ వస్తే తప్ప కన్ఫర్మ్ గా ఏమీ చెప్పలేం. ఇప్పటికే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి.


End of Article

You may also like