బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు. ఐతే.. షణ్ముఖ్ విషయం లో భారీ హైడ్రామా నే నడిచింది. షణ్ముఖ్ బిగ్ బాస్ కి వస్తున్నాడు అని.. ఆ తరువాత రిజెక్ట్ చేసారు అని ఇలా రకరకాలుగా కధనాలు వెలువడ్డాయి.

shannu

షణ్ముఖ్ హౌస్ కి రావడం తో ఫాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ, హౌస్ లో షన్ను డల్ గా కనిపిస్తున్నారట. యు ట్యూబ్ వీడియోస్ లో కనిపించే చలాకి షణ్ముఖ్ నేనా మనం చూస్తోంది అనుకుంటున్నారట. మరో వైపు షణ్ముఖ్ బిగ్ బాస్ యాజమాన్యం ఇచ్చే రెమ్యునరేషన్ పై కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వారానికి రెండు నుంచి 2.5 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది అని టాక్ వినిపిస్తోంది.