Ads
జబర్దస్త్ షో తో హాస్యాన్ని పండిస్తూ నవ్వించే కమెడియన్స్ లో శాంతి స్వరూప్ కూడా ఒకరు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి శాంతి స్వరూప్ వచ్చారు. 2001లో ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు తనకి భోజనం దొరికితే చాలు అని అనుకునేవారట. ఒక్కోసారి గుడికి వెళ్ళి ప్రసాదం తిని కడుపు నింపుకునేవాడినని అన్నారు.
Video Advertisement
ఇలా ఎన్నో కష్టాలను అనుభవించిన శాంతి స్వరూప్ ప్రస్తుతం ఆది వల్లే ఈ స్థితిలోకి వచ్చానని.. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆదీ ఏ కారణం అని ఎమోషనల్ అయ్యారు శాంతి స్వరూప్. గతంలో పది రూపాయలు చేతిలో ఉంటే చాలు అనుకునే వాడిని అని బాధపడ్డాడు.
కొంచెం డబ్బులుంటే అరటిపండ్లు కొనుగోలు చేసి వాటిని తినేసి పడుకొనే వాడిని అని చెప్పారు. ఇలా తాను ఎన్నో కష్టాలను అనుభవించానని.. తన తండ్రి అంత్యక్రియలకు రెండు వేల రూపాయలు అప్పు చేసి అంత్యక్రియలు జరిపించానని చెప్పారు. అయితే ఆది వల్ల ఈ స్థితిలో ఉన్నానని చనిపోయే అప్పుడు అతని పేరునే తలచుకుంటానని శాంతి స్వరూప్ అన్నారు.
End of Article