థియేటర్ల‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జవాన్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

థియేటర్ల‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జవాన్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

by Harika

Ads

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సౌత్ ఇండియా స్టార్ నయనతార నటించిన జవాన్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌ టాక్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాను స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.

Video Advertisement

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా దుమారం రేపుతోంది. సినిమా రిలీజ్ అయిన పదిరోజులకే ప్రపంచ వ్యాప్తంగా 797.50కోట్లు వచ్చిందని జవాన్ టీమ్ తెలిపింది.

Jawan Box Office Collection Day 10: Shah Rukh Khan Film Witnesses Solid Second Saturday, Nears Rs 500 Crore Mark | Hindi News, Times Now

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి ప్రధాన యాక్టర్లు కూడా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా షారుక్‌కి జంటగా గెస్ట్ రోల్ చేసింది. షారుఖ్ సొంత బ్యానర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అనిరుద్ద్ సంగీతం అందించాడు. అయితే థియేటర్‌లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.

Jawan Movie Review: Why i didn't like Jawan despite being a Shah Rukh Khan fan

దీనికి డైరక్టర్ అట్లీ స్పందిస్తూ.. షారుఖ్ ఖాన్ రన్ టైమ్, ఎమోషనల్ సీన్లతో జవాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేశాం. ఇంకా కొన్ని సీన్లు మళ్లీ యాడ్ చేయాలని అనుకుంటున్నాం. ఓటీటీలో ఈ సినిమా మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేసే విధంగా ఉంటుందని అట్లీ తెలిపారు. కానీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మాత్రం చెప్పలేదు.

BREAKING: Shah Rukh Khan and Atlee's next titled Jawan; SRK to announce it with a teaser : Bollywood News - Bollywood Hungama

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికోసం సుమారుగా రూ.250కోట్లు వెచ్చించిందట. అయితే ఈ సినిమా నవంబర్ మొదటివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీపావళి కానుకగా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జవాన్ హిట్‌తో సంతోషంగా ఉన్న అట్లీ అల్లుఅర్జున్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం.


End of Article

You may also like