కొడుకు చేసిన పనికి షారుఖ్ ని తిడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..?

కొడుకు చేసిన పనికి షారుఖ్ ని తిడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..?

by Anudeep

Ads

ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా.. పిల్లలని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని పెంచే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఒక స్టేజి కి వచ్చాక అవమానాలు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అలాంటి అవమానాలనే ఎదుర్కొంటున్నాడు. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు లో అడ్డం గా దొరికిపోయాడు. ఈ విషయం క్షణాల్లో బయటకి పొక్కింది. రేవ్ పార్టీ లో డ్రగ్స్ సేవిస్తూ ఆర్యన్ మత్తులో పడిపోయాడు. అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం తో ఈ వార్త సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.

Video Advertisement

sharukh

ఒకప్పుడు ఇలాంటి విషయాలు పెద్దగా బయటకి వచ్చేవి కాదు కానీ, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇలాంటివి చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతున్నాయి. మరోవైపు నెటిజన్లు షారుఖ్ ఖాన్ పై గట్టి గానే ట్రోల్స్ వేస్తున్నారు. కొడుకుని చక్కదిద్దుకోవడం చేతకాదు కానీ, బైజూస్ యాడ్ లో నటించి ఓ మేధావి క్యారెక్టర్ లో పాఠాలు చెప్తూ ఉండడాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమం లో బైజూస్ యాజమాన్యం రంగం లోకి దిగిందని సమాచారం. మరికొన్ని బ్రాండ్లు కూడా షారుఖ్ ను తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొడుకు వల్ల కోట్లలో నష్టం రావడం మాత్రమే కాదు, పేరు కూడా చెడిపోతోందని షారుఖ్ మదనపడుతున్నాడట.


End of Article

You may also like