Ads
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజలందరిలో భయం పెరిగిపోతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి ఫలితం లేకపోవడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కంటికి కనపడని అతి చిన్న వైరస్ కొన్ని చోట్ల మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపుతుంటే, మరికొన్ని చోట్ల మనుషులని స్వార్ధపరులుగా మార్చేస్తుంది.. ప్రాణభయంతో సాయం చేయడానికి ముందుకు రాకుండా చేస్తుంది.
Video Advertisement
నిర్మల్ ఈద్ గావ్‌కి చెందిన 44 ఏళ్ల మహారాజ్ లింగ్ రాజు కామారెడ్డి రైల్వేస్టేషన్లో హామాలిగా పనిచేసేవాడు. కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ఉండటంతో గాంధీ గంజ్ ప్రాంతంలో తలదాచుకుంటూ, దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటున్నాడు. ఒంటరిగా జీవిస్తున్న రాజు శనివారం రాత్రి చనిపోయాడు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకి ఫోన్ చేశారు.రైల్వేస్టేషన్ కు వచ్చిన పోలీసులు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని భావించి సాయం పట్టమని స్థానికుల్ని కోరారు.
అయితే, మనకు బాగా తెలిసిన వ్యక్తి అయినా బయటికి వెళ్లి వచ్చినా, దగ్గినా,తుమ్మినా అనుమానంగా చూస్తున్న ఈ కరోనా కాలంలో ఓ అనాధ శవాన్ని తాకేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పోలీసుల వద్ద కూడా మృతదేహాన్ని తరలించేందుకు వాహనం లేకపోవడంతో, రైల్వేలో అనాధ శవాలని సంస్కరించే వారికి సమాచారమిచ్చారు. శవాన్ని తీసుకెళ్లడానికి రాజు అనే వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. శవాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వెహికిల్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి. ఒక దుప్పట్లో చుట్టి , తన సైకిల్ పై పెట్టుకుని హాస్పటల్ కి తీస్కెళ్లాడు.
మనిషి జీవితంలో జరిగే చిట్టచివరి ఘట్టం చావు, పుట్టేటప్పుడు నలుగురు లేకపోయినా చనిపోయేప్పుడు చుట్టు నలుగురు ఉండాలని కోరుకుంటారు. కాని ప్రస్తుత కరోనా కాలంలో అది అసాధ్యం. ఎవరైనా చనిపోవాల్సిందే, కాని ఇలాంటి చావు ఎవరికి రాకూడదని ఎవరికి వారే కోరుకుంటున్నరు. రైల్వేస్టేషన్ నుండి హాస్పిటల్ కి శవాన్ని సైకిల్ పై తీసుకెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మొన్నటికి మొన్న నెల్లూరులో కరోనాతో ఒక డాక్టర్ చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కనీసం స్మశాన వాటికలో కూడా సంస్కారాలు చేయడానికి ఒప్పుకోలేదు. అనాధగా చనిపోయాడంటూ ఎన్నో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ రాజు వార్త, ఒకవైపు కరోనా గురించి భయపడుతున్న ప్రజలకు, ఇప్పుడు మరో రకమైన భయాందోళనలు స్టార్టయ్యాయి.. నిజానికి రాజు కరోనాతో చనిపోలేదు.. అయినా కూడా ఎవరూ కూడా అతని శవాన్ని ముట్టుకోవడానికి ముందుకు రాలేదు..ముందు ముందు ఎలాంటి పరిస్థితులు చూడాలో..ప్చ్..
End of Article