ఆమె నిర్మల సీతారామన్ కూతురంటూ ఫోటో వైరల్…ఆ ఫేక్ న్యూస్ వెనకున్న అసలు కథ ఇదే.!

ఆమె నిర్మల సీతారామన్ కూతురంటూ ఫోటో వైరల్…ఆ ఫేక్ న్యూస్ వెనకున్న అసలు కథ ఇదే.!

by Anudeep

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్మార్ట్ కాదు.. అనే దానికి నిదర్శనం శేర్ అయ్యే ఫేక్ మెసేజ్లే…మనకి రోజుకి ఒక పది మెసేజ్లు వచ్చాయంటే వాటిల్లో తొమ్మిది మెసేజ్లు ఫేకే ఉంటాయి..అవి ఎవరు క్రియేట్ చేస్తారు..ఎందుకు క్రియేట్ చేస్తారనే విషయం ఇక్కడ అనవసరం కానీ ఒక ఫోటోని కాని, వార్తని కాని షేర్ చేస్తున్నాం అంటే అది నిజమో కాదో అని ఆలోచించలేకపోవడం శోచనీయం..అటువంటి ఫేకుల్లో  ఒకటే నిర్మలా సీతారామన్ కూతురు అంటూ వైరలవుతున్న ఫోటో..

Video Advertisement

అర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో ఉన్న ఒక లేడీ ఆఫీసర్ ఫోటోని శేర్ చేస్తూ.. వాహ్ దేశం కోసం పోరాడడానికి కూతురిని ఆర్మీలో చేర్చిన తల్లి..తల్లీ కూతుల్లిద్దరూ దేశసేవలోనే ఉన్నారు.ఇదీ దేశభక్తంటే అంటూ..నోటికొచ్చిన గంభీరమైన డైలాగులు టైప్ చేసి పడేసి,ఫోటోని శేర్ చేసేసారు..ఇంకేముంది అది అసలు నిజమా కాదా ఆలోచించకుండా వైరల్ చేసిపడేశారు. నిజానికి ఆ ఫోటో నిజమే కానీ, తను నిర్మలా సీతారామన్ కూతురు కాదు..మరెవరు అనేది ప్రశ్న.

నిర్మలా సీతారామన్ కూతురు అంటూ ప్రచారమవుతున్న ఫోటో , నిర్మలా డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పటిది.. అంటే  2018 లో తీసింది.ఆర్మిని కలవడానికి అరుణాచల్ ప్రదేశ్ లోని హ్యూలాంగ్ ఏరియాకు  వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆఫీసర్ ని నిర్మలా సీతారామన్ కు లైజెన్ ఆఫీసర్ గా నియమించారు.. ఆమె పేరే నికితా వీరయ్య..నిర్మలతో ఫోటోలో ఉన్నది ఆమెనే..అప్పుడు నిర్మల పర్యటన ముగిసిన తర్వాత నికితా, అప్పటి  డిఫెన్స్ మినిస్టర్ అదేనండి ఇప్పటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలతో ఫోటో తీయించుకున్నారు..దానినే నిర్మలాసీతారమన్ కూతురు అంటూ సోషల్ మీడియాలో వైరల్  చేశారు.

ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది..నిర్మల సీతారామన్ కు పిల్లలెంతమంది అని..ఉన్నారు..నిర్మల, పరకాల ప్రభాకర్ దంపతుల ఏకైక కుమార్తే పేరు పరకాల వాంగ్మయి..జర్నలిజంలో మాస్టర్స్ చేసిన వాంగ్మయి తర్వాత కొన్ని పత్రికలకు జర్నలిస్ట్ గా పనిచేసింది.హెల్త్, యూత్ ఇతరత్రా టాపిక్స్ పై ఆర్టికల్స్ రాసింది..చాలామంది పెద్దవాళ్లు వాళ్ల పిల్లల విషయాలు గోప్యంగా ఉంచుతారు..వాంగ్మయి విషయాలు కూడా అంతే..జర్నలిజం చేసింది, జర్నలిస్టు గా పనిచేసింది..ఇప్పటికి జర్నలిస్టే..

 


You may also like

Leave a Comment