Shekar Review: “రాజశేఖర్” ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Shekar Review: “రాజశేఖర్” ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Sunku Sravan

Ads

  • చిత్రం : శేఖర్
  • నటీనటులు : హీరో రాజశేఖర్, అభినవ్ గోమతం, ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, భరణి, సమీర్, రవి వర్మ .
  • నిర్మాతలు : బొగ్గరం వెంకట శ్రీనివాస్, బీరం సుధాకర రెడ్డి.
  • దర్శకత్వం : జీవిత రాజశేఖర్
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • విడుదల తేదీ :మే 20,2022

shekar movie review

Video Advertisement

 

స్టోరీ :
ఇప్పుడు కనిపించే డాక్టర్ రాజశేఖర్ ఒకప్పుడు అగ్ర హీరోల్లో ఒకరిగా ఉండేవారు . ఇప్పటికే ఆయన హీరోగా కొనసాగుతూ చాలా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అతని తాజా చిత్రం ” శేఖర్” గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ ఎట్టకేలకు మే 20 2022 థియేటర్ లోకి వచ్చింది. ఈ తరుణంలో ఈ మూవీకి ఎలాంటి స్పందన వచ్చిందో ఓసారి చూద్దాం..? ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్. క్రైమ్ కు సంబంధించిన విషయాలను పరిశోధన చేయడంలో నిపుణుడు. ఒక్క క్షణంలో నేరస్తుడిని కనుగొనడంలో మాస్టర్ అని చెప్పవచ్చు.

shekar movie review

అతని నైపుణ్యాలను ఉపయోగించి ప్రస్తుతం పోలీసు అధికారులు డబుల్ మర్డర్ కేసును ఛేదించడం కోసం అతని సహాయాన్ని తీసుకుంటారు. ఈ ప్రాసెస్ లోనే అతని భార్య ఇందు నుండి విడిపోయి ఆమె జ్ఞాపకాలతో ఉంటాడు. ఒకరోజు ఇందుకు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఆమెను హాస్పిటల్లో చేర్చాక చనిపోతుంది. దీంతో రాజశేఖర్ ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదని ఎవరో హత్య చేశారని అనడంతో కథ మలుపు తిరుగుతుంది.. మరి ఆమెను హత్య చేసింది ఎవరు..? అతడు కేసు పరిష్కరిస్తాడా..? ఇందు అతని నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..? ఇవన్నీ తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే..?

shekar movie review

రివ్యూ :

సినిమాల్లో ఎప్పుడూ సస్పెన్స్ ఉంటే అవి బోర్ కొట్టవు. అయితే ఈ మూవీలో అనువనువు సస్పెన్స్ నెలకొంది. కథ కూడా ప్రత్యేకంగా ఉంది. అయితే ఇది భోజ్ జార్జ్ మలయాళం సూపర్ హిట్ మూవీ జోసెఫ్ 2018 కి రిమేక్ చేశారు. కానీ మూవీ యూనిట్ మాత్రం దీన్ని రీమేక్ అని ఎక్కడా చెప్పలేదు. కానీ జోసెఫ్ తెలిసిన వారికి దీని గురించి తెలుస్తుంది. 2018 సంవత్సరంలో అద్భుతమైన కథ మరియు ప్రత్యేకమైన కథాంశంతో పాత్రల రూపకల్పన హైలెట్ అయ్యింది. కానీ 2022 వరకు వచ్చేసరికి ఇది ప్రత్యేకమైన కథాంశం కాకపోవచ్చు. ఇందులో రొటీన్ సన్నివేశాలు ఉండటం వల్ల ఈ మూవీకి కాస్త లోపం ఇదే అవ్వోచ్చు.

ప్లస్ పాయింట్స్ :

  • రాజశేఖర్ పాత్ర
  • సస్పెన్స్ సీన్స్
  • సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ సన్నివేశాలు ఉండటం
  • ఇంత ముందు ఎక్కడో చూశాం అనిపించే సీన్స్

రేటింగ్:
2.5/5

ట్యాగ్ లైన్ :

రీమేక్ మూవీ కాబట్టి చాలామందికి ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది. కానీ రాజశేఖర్ ఇందులో కొత్త లుక్ లో అనేక ట్విస్టులతో కనిపించారు. క్షణక్షణం సస్పెన్స్ ధ్రిల్లర్ గా కనిపించిన ఈ మూవీ ని ఎంజాయ్ చేయాలనుకునేవారిని నిరాశపరచడు. ఈ ఏడాది వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో


End of Article

You may also like