Ads
సాధారణంగా ఎవరైనా ఒక మనిషి ఏదైనా కవిత్వంతో ఒక లైన్ చెప్తే, “బాగుంది. ఆటో వెనుక రాసుకోవచ్చు” అని సరదాగా ఆటపటిస్తూ ఉంటారు. ఇది నిజమే. అంటే, ఆటో వెనకాల రాసే లైన్లు చాలా పోయేటిక్ గా ఉంటాయి. ఏదో సినిమాలో మాట్లాడే డైలాగ్స్ లాగా, లేదా ఎవరైనా ఒక కవి చెప్పే మాటల లాగా అవి ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ప్రేమ గురించి ఎక్కువగా ఉంటాయి. వీటిని చూసి మొదటిలో ఎలా అనిపించేదో తెలియదు కానీ, తర్వాత మాత్రం వీటిని చూసి కామెడీ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. “హాయ్ అని ఆశ పెట్టవద్దు. బాయ్ అని బాధ పెట్టవద్దు” అంటూ చాలా లైన్స్ రాస్తారు.
Video Advertisement
అందుకే వీటిని చూసి చాలా మంది సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా ఇలా ఏదైనా ఒక హీరో చెప్తే, “ఈ లైన్ ఆటో వెనకాల రాసుకో” అని కౌంటర్ ఇచ్చే సీన్స్ చాలానే చూశాం. ఇవన్నీ సినిమాల వరకు పరిమితం అయితే బానే ఉంటుంది. కానీ నిజంగా కూడా ఇటీవల అలా ఆటో వెనుక ఒక లైన్ కనిపించింది. రజనీకాంత్ గారు హీరోగా నటించిన శివాజీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు.
“లేదురా మామ. వచ్చిన దాన్ని చేసుకోవడం కన్నా, నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడే లైఫ్ సంతోషంగా ఉంటుంది” అని రజనీకాంత్ గారు, వివేక్ గారితో చెప్తారు. అప్పుడు వివేక్ గారు, “ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుందే” అని అంటారు. ఇది నిజంగానే ఒక వ్యక్తి సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల ఒక ఆటో వెనుక ఇలాంటి లైన్ ఒకటి కనిపించింది. సాధారణంగానే సినిమాలు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇస్తాయి అంటారు. ఒక వ్యక్తి సినిమా నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి లైన్స్ రాసుకున్నారు అన్నమాట. అది కూడా సినిమాలో చెప్పినట్టే అదే డైలాగ్ ఆటో వెనుక రాసుకున్నారు.
watch video :
ALSO READ : బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జగతి మేడం.? సీరియల్ లో తల్లి పాత్ర…మరి సినిమాలో ఏంటంటే.?
End of Article