సీనియర్ నటుడు ఆత్మహత్యాయత్నం…ప్రాణాలు కాపాడిన ప్రకాష్ రాజ్..!

సీనియర్ నటుడు ఆత్మహత్యాయత్నం…ప్రాణాలు కాపాడిన ప్రకాష్ రాజ్..!

by Anudeep

ఏ పాత్రనైనా అలవోకగా నటించగల విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .సామాజిక సమస్యలపై గళం విప్పే సినిమా వాళ్ల జాబితాలో ప్రకాశ్ రాజ్ ది మొదటి పేరుంటుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించే ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ హీరో అని ఎనో సార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాకి శేర్ చేశారు నటుడు శివాజి రాజా. అదేంటో మీరే చూడండి.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమావాళ్లకి సరిగ్గా సూటవుద్ది. అవకాశాలున్నప్పుడే డబ్బులు పోగేసుకోవడం తెలియక ఎందరో నటులు అవస్థలు పడుతుంటారు, కొందరు అడ్డదారులు తొక్కుతారు. అలా ఆర్ధికంగా బాగా చితికిపోయిన ఒక సీనియర్ నటుడు , అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యాయాత్నం చేసారట. తన తోటి నటుడు చనిపోవడానికి సిద్దపడ్డారని తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ చలించిపోయారు.వెంటనే ఆ నటున్ని తన వద్దకు తీసుకురమ్మని శివాజిరాజాని అడిగారట.

ప్రకాశ్ రాజ్ అడగడంతో నేను అతన్ని తన వద్దకు తీసుకువెళ్లాను. వెళ్లాక కొద్దిసేపు రిలాక్స్ అవ్వమని చెప్పారు. ఆ తర్వాత జీవితంలో ఎంతపెద్ద సమస్యలొచ్చినా చనిపోవాలనే నిర్ణయం తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇప్పుడు నీకున్న సమస్యేంటి అప్పు. అంతేకదా, ఆ అప్పు నేను తీరుస్తాను అని అన్నారట.ఇదంతా తన ముందే జరిగిందని చెప్పుకొచ్చారు శివాజి రాజా.

ఇంతకీ ఆ నటుడు అప్పుల విలువ అక్షరాలా యాభై లక్షలు . యాభైలక్షల రుణం తీర్చే బాద్యత తనపై వేసుకున్నారు. అది భారం అనుకోలేదు. తన తోటినటుడు కష్టాల్లో ఉండడం చూడలేక బాద్యతగా తీసుకున్నారు.  ఆ సీనియర్ యాక్టర్ పేరు బయటకి చెప్పడానికి నిరాకరించారు శివాజీరాజా, అంతేకాదు ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ తను చేసిన సాయం గురించి చెప్పుకోవాలని చూడరు, కాని ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన మరో వ్యక్తి గురించి తెలిసి నేను చెప్పకుండా ఉండడం భావ్యం కాదు అందుకే చెప్తున్నాను అంటూ ఉద్వేగానికి గురయ్యారు.

You may also like

Leave a Comment