కన్నీళ్ళకే కన్నీరు తెప్పిస్తున్న “విస్మయ” ఘటన.. అదనపు కట్నం కోసం వేధించి.. ఆపై ఆత్మహత్య గా చిత్రీకరించి..!

కన్నీళ్ళకే కన్నీరు తెప్పిస్తున్న “విస్మయ” ఘటన.. అదనపు కట్నం కోసం వేధించి.. ఆపై ఆత్మహత్య గా చిత్రీకరించి..!

by Anudeep

Ads

కాలం ఎంత వేగం గా మారుతున్నా.. ఆడవారి పట్ల దారుణాలు మాత్రం ఆగడం లేదు. విస్మయ ఆత్మహత్య ఘటన కేరళను కుదిపేస్తోంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న దిశగా చేపట్టిన విచారణ లో.. ఆమె ది హత్య అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల వెలుగు లోకి వచ్చిన మెసేజ్ లు, ఫోటోలు ఈ కేసులో కీలకం గా మారాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

vismaya 1

సమయం కధనం ప్రకారం.., కేరళ, కొల్లం జిల్లా సస్తంకొట్ట కు చెందిన కిరణ్ కు విస్మయ ని ఇచ్చి వివాహం చేయాలనీ పెద్దలే నిర్ణయించారు. 2020 లో వీరి వివాహం జరిగింది. కిరణ్ కుమార్ ఆర్డీఏ లో ఇన్స్పెక్టర్ కావడం తో మంచి సంబంధం వచ్చిందని విస్మయ తల్లితండ్రులు మురిసిపోయారు. భారీ గా కట్నకానుకలు కూడా సమర్పించారు. అయితే.. వివాహం అయినా కొద్దిరోజులకే.. కట్నం కింద తనకు ఇచ్చిన కారుకి బదులు నగదు ఇవ్వాలని, అది కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని కిరణ్ విస్మయ ను వేధించే వాడు.

vismaya 2

ఓ సారి పార్టీ సందర్భం గా విస్మయ భర్త కిరణ్ తో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అతిగా మద్యం సేవించిన కిరణ్ మద్యం మత్తులో తల్లితండ్రుల ముందే విస్మయ పై చేయి చేసుకున్నాడు. దీనితో అడ్డుపడిన విస్మయ అన్న పై కూడా దాడి చేసాడు. అప్పటినుంచి విస్మయ తల్లితండ్రుల వద్దే ఉండిపోయింది. ఆ తరువాత రెండు నెలల కిందటే బిఎంఎస్ పరీక్ష రాయడం కోసం విస్మయ కాలేజీ కి వెళ్ళింది. ఆ సమయం లోనే కిరణ్ ఆమెను బలవంతం గా ఇంటికి తీసుకెళ్లాడు.

vismaya 3

అప్పటి నుంచి ఆమె పుట్టింటికి రాలేదు. ఆ తరువాత తండ్రికి గాని, అన్నకి గాని ఆమె ఫోన్ చేయలేదు. కేవలం తన అమ్మ కు మాత్రం ఫోన్ చేసి భర్త ఎలా చిత్రహింసలు పెడుతున్నాడో చెప్పుకుని బాధపడేది. జూన్ 19 వ తేదీన ఆమె ఉండబట్టలేక తన భర్త కొట్టిన దెబ్బల ను తన కజిన్ కు మెసేజ్ లలో చూపించింది. ఎవరికీ చెప్పొద్దని అడిగింది. తాను ఎవరికీ చెప్పలేదని తెలిపింది. ఆ తరువాత ఓ రోజు కిరణ్ కుటుంబ సభ్యులు విస్మయ ఆత్మహత్య కు పాల్పడిందని ఆసుపత్రికి తీసుకొచ్చామని చెప్పడం తో.. విస్మయ తల్లితండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే.. విస్మయ అప్పటికే మరణించింది.

vismaya 4

అయితే.. విస్మయ ను అత్తమామలు వేధించి హత్య చేశారని ఆమె తల్లితండ్రులు ఆరోపించి, కిరణ్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసారు. ఈ ఘటన పై కేరళ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఘటనపై కేరళ మహిళా కమిషన్ తమకు నివేదిక సమర్పించాలంటూ కొల్లం రూరల్ ఎస్పీ కి ఆదేశాలను కూడా జారీ చేసింది.

 


End of Article

You may also like