సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు సినిమాల్లోనూ అటు వ్యాపారంలోను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్ లోనే కాక వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, రాజకుమారుడిగా కెమెరా ముందుకి వచ్చి తన ప్రతిభతో ఒక్కొ మెట్టు ఎక్కి సూపర్‌స్టార్‌గా అభిమానులను ప్రేమను పొందుకుని, మహేష్ బాబు టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగాడు.

Video Advertisement

 

అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు.

shocking prices of mahesh babu's restaurent..!!
అయితే తాజాగా ఏషియన్ గ్రూప్స్ తో కలిసి AN రెస్టారెంట్ ను స్టార్ట్ చేసాడు మహేష్. దీనికి తన భార్య నమ్రత పేరు పెట్టాడు మహేష్. ఇది డిసెంబర్ 8 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ రెస్టారెంట్ లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటూ అన్ని దేశాల రుచులను కూడా పరిచయం చేస్తున్నారు.లోకల్ టూ నాన్ లోకల్, ఇండియన్ టూ కాంటినెంట్ వరకు అన్ని ఇక్కడ లభ్యం అవుతున్నాయట. అయితే ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఐటమ్స్ ధరలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

shocking prices of mahesh babu's restaurent..!!

కప్ టీ 80 రూపాయలు, రెండు ఇడ్లీ 90 రూపాయలు, ప్లేట్ బజ్జీ 125 రూపాయలు ఉండటంతో ఈ రేట్లను చూసి షాకవుతున్నారు. ఇక దోస మినిమమ్ 200 రూపీస్ నుంచి మొదలు ఇడ్లి ధర వంద రూపాయలు ఉందట. .ఇక ఫ్యామిలీ తో కలిసి మహేష్ నమ్రత రెస్టారెంట్ కి వెళ్తే దాదాపు 1000 కి బిల్లు కట్టకుండా బయటకు రాలేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

shocking prices of mahesh babu's restaurent..!!

మహేష్ ఇప్పటికే ఏషియన్ వారితో కలిసి ‘ఏఎమ్బీ సినిమాస్’తో మల్టీప్లెక్స్ బిజినెస్ లో తనదైన ముద్ర వేశాడు. ఇది హైదరాబాద్ లోని అతిపెద్ద మల్టీపెక్స్. ఇది కాకుండా టెక్స్ టైల్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాడు. ‘ద హంబుల్ కో’ అనే బ్రాండ్ తో మింత్రాలో చూడొచ్చు. ఇప్పుడు ముచ్చటగా మూడవది రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసాడు మహేష్.